Fashion Tips For Women: లావుగా ఉన్నవారు డ్రెస్సింగ్ విషయంలో ఈ టిప్స్ పాటిస్తే సన్నగా కనిపిస్తారు.
ముఖ్యంగా లావుగా ఉన్నవారు కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ ను పాటించినట్లయితే సన్నగా కనిపిస్తారు
ఫ్యాషన్ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మనము అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తాము. ముఖ్యంగా లావుగా ఉన్నవారు కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ ను పాటించినట్లయితే సన్నగా కనిపిస్తారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రెస్సెస్- ఎక్కువ లావు ఉన్నవారు సన్నగా కనిపించడానికి వారు డ్రెస్సెస్ విషయంలో ఈ టిప్స్ పాటిస్తే సన్నగా కనిపిస్తారు. వారు పెద్ద పెద్ద ప్రింట్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోకుండా చిన్న చిన్న పువ్వులు సన్నగా ఉన్న గీతలు వంటివి వేసుకుంటే మీరు సన్నగా కనిపిస్తారు. అంతేకాకుండా మీరు నెక్ డిజైన్ ను v నెక్ డిజైన్ వేసుకున్నట్లయితే లావుగా కనిపించరు. దీనివల్ల మీరు సన్నగా స్లిమ్ గా కనిపిస్తారు. మీరు డ్రెస్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు టాప్, బాటము రెండు ఒకే కలర్ లో ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు లావుగా కనిపించరు అలా కాకుండా రెండు డిఫరెంట్ కలర్ ను వాడినట్లయితే మీరు లావుగా కనిపిస్తారు.
అంతేకాకుండా ఎప్పుడు కూడా స్కిన్ టైట్ వంటివి వేసుకోకూడదు. ఎప్పుడు కూడా కొంచెం మీ శరీరానికి వదులుగా ఉండేటువంటి డ్రెస్సెస్ వాడితే మీరు సన్నగా కనిపిస్తారు. బెల్లి ఫ్యాట్ అనేది హైడ్ అవుతుంది.
లావుగా ఉన్నవారు ఎక్కువగా డార్క్ కలర్స్ ను తీసుకోవాలి. డార్క్ కలరు మిమ్మల్ని సన్నగా ఉంచేలాగా హైట్ చేస్తుంది. కాబట్టి లైట్ కలర్స్ కంటే డార్క్ కలర్స్ ను ఎక్కువగా వాడినట్లయితే మీరు సన్నగా కనిపిస్తారు.
Astrology: కనక దుర్గమ్మకు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే..
హిల్స్- హిల్స్ విషయానికొస్తే మీరు మీ వీలును బట్టి హీల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ డ్రెస్కు సూట్ అయ్యే హీల్స్ ను సెలెక్ట్ చేసుకుంటే మీరు సన్నగా కనిపిస్తారు
హెయిర్ స్టైల్- హెయిర్ స్టైల్ విషయానికి వస్తే లావుగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కర్లీ హెయిర్ స్టైల్ ను సెలెక్ట్ చేసుకోకూడదు. మీరు ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉన్నాయి. హెయిర్ స్టైల్ ని పార్టీ ఇచ్చినట్లయితే మీరు సన్నగా పొడుగ్గా కనిపిస్తారు.