Fashion Tips For Women: కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..
ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలడము, మచ్చలు రావడం వంటివి ఏర్పడతాయి.
చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మన చర్మం ఎప్పుడు కూడా డల్ గానే ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలడము, మచ్చలు రావడం వంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా ఎక్కువగా కాలుష్యము ఆరోగ్య సమస్యలు డైట్లో ఏర్పడిన కొన్ని అంశాల వల్ల మన స్కిన్ చాలా ప్రభావితం అవుతుంది. అయితే ముఖ్యంగా కొరియన్స్ లో స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా ఉంటుంది వీరు చర్మం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో మనం ఇప్పుడు అవన్నీ తెలుసుకుందాం.
ముఖ్యంగా గ్లాస్ స్కిన్ కావాలంటే మనము మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి టిప్స్ ఫాలో అవుతే గ్లాస్ స్కిన్ మీ సొంతం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్కిన్ కేర్- మన స్కిన్ని కూడా రెగ్యులర్ గా మనము క్లెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే క్లీన్సింగ్ లో ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. ముఖ్యంగా జెల్ టైపు ఉండే క్లెన్సర్స్ ఫోన్ క్లిన్సర్స్ వచ్చాయి. అయితే మీ చర్మ తత్వానికి ఏది సూట్ అవుతుందో అది చూసుకొని అప్లై చేసుకోవడం మంచిది. ముఖ్యంగా రెగ్యులర్ పగలు రాత్రి రెండు సార్లు కూడా క్లీన్సింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల చర్మం పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోతుంది. తర్వాత ముఖ్యంగా గ్లాస్ స్కిన్ కోసం సీరంను యూస్ చేస్తూ ఉండాలి. సీరంలో ఎక్కువగా విటమిన్ సి ఉన్నవి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. స్కిన్ పైన పింపుల్స్ ఉన్నవారు విటమిన్ సి ని వాడకపోవడం మంచిది. దీని తర్వాత చర్మానికి మాయిశ్చరైసర్ని రాసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఎక్కువ గా దీన్ని ఉపయోగించాలి. దీన్ని అస్సలు మిస్ చేయకూడదు. దీనివల్ల స్కిన్ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాకుండా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లోషన్ అప్లై చేయాలి అది ఎస్పీఎఫ్ 50 ప్లస్ ఉండేలా చూసుకుంటే చాలా మంచిది.
Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..
ఈ టిప్స్ పాటించాలి- పైన నుంచి ఎన్ని రకాల క్రీమ్స్ అప్లై చేసినా కూడా మనం మన శరీరం లోపట కూడా కొన్ని రకాల చిట్కాలను పాటించినట్లయితే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ముఖ్యంగా మనము ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. దీనివల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇది మంచి స్కిన్ టోన్ ను అందిస్తుంది. ముఖ్యంగా ఫుడ్డులో కూరగాయలు, పండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్ ,ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్ గా వ్యాయమం చేయడం వల్ల కూడా ముఖంలో గ్లో అనేది వస్తుంది. ధ్యానం మెడిటేషన్ ప్రాణాయామం వంటివి చేయడం వల్ల కూడా గ్లాస్ స్కిన్ ప్రమోట్ చేస్తుంది ముఖ్యంగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలని ఎందుకు మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మానికి హాని కలిగించే ఎటువంటి ప్రోడక్ట్లను కూడా వాడకుండా ఉండాలి.