చాలామందిలో చలికాలంలో పెరుగు తినాలా వద్ద అన్న అనుమానం ఉంటుంది. అయితే చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దాన్ని తీసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకొని తినడం ద్వారా ఆ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది- పెరుగులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కాబట్టి మన అజీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగును ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాలి.
Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది- పెరుగులో ప్రోబయాటిక్స్ క్యాల్షియం ,యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీని ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా బయటపడవచ్చు.
చర్మానికి మంచిది- పెరుగును ప్రతిరోజు తినడం ద్వారా పెరుగులో ఉన్న పోషకాలాన్ని కూడా మన చర్మానికి జుట్టుకు పోషణను అందిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పెరుగు తీసుకోవడం ఉత్తమం.
ఎముకలకు మంచిది- పెరుగులో క్యాల్షియం విటమిన్ డి అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. కండరాల పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది.
బరువు తగ్గుతారు- ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చలికాలంలో ఎవరు పెరుగు తినకూడదు
చల్లటి పెరుగు తినడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు వస్తాయి. గొంతు నొప్పి తరచుగా దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు కొంచెం పెరుగును తగ్గిస్తే మంచిది. ఆస్తమా సైన సమస్య ఉన్నవారు పెరుగును అధికంగా తీసుకోకూడదు. ఈ చలికాలంలో కాస్త తక్కువగా తీసుకుంటే మంచిది.
చలికాలంలో పెరుగును ఎలా తీసుకోవాలి
చల్లని పెరుగును తినకూడదు, అదే విధంగా ఫ్రిడ్జ్ లో ఉంచిన పెరుగును తీసిన తర్వాత చాలా సేపు బయట ఉంచిన తర్వాత మాత్రమే తినాలి అంటే కాకుండా రాత్రిపూట పెరుగు తినడం మానుకుంటే మంచిది. పెరుగు తినాలి అనుకున్నప్పుడు అల్లము, జీలకర్ర, ఎండుమిర్చి వంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల ఆహారము మీకు పెరుగు వల్ల వచ్చే ఇబ్బంది కలుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి