Fashion Tips For Women: రాత్రిపూట టైట్ ఉన్న బట్టలు వేసుకొని పడుకుంటున్నారా అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి..
ముఖ్యంగా జీన్స్, టైట్ గా ఉండే లెగ్గిన్స్ ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు జీన్స్ టైట్ గా ఉండే లెగ్గిన్స్ వేయడం ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అసౌకర్యంగా ఉంటుంది
ఈ మధ్యకాలంలో తరచుగా అమ్మాయిల్లో ఫ్యాషన్ ట్రెండ్ ఎక్కువగా అయిపోయింది. ముఖ్యంగా జీన్స్, టైట్ గా ఉండే లెగ్గిన్స్ ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు జీన్స్ టైట్ గా ఉండే లెగ్గిన్స్ వేయడం ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది వీటిని వేసుకోవడానికి ఇష్టపడతారు. వీటితోటే పడుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.
ఇన్ఫెక్షన్స్- టైట్ గా ఉండే బట్టలు వేసుకోవడం ద్వారా శరీరానికి తగినంత గాలి ఆడదు. దీని వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెమట పడుతుంది. బట్టలు వేసుకోవడం ద్వారా చెమట అక్కడ పేరుకుపోయి ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ లో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో టైట్ గా ఉన్న బట్టలను ఎక్కువసేపు మీరు ధరించకపోవడమే ఉత్తమం.
Astrology: డిసెంబర్ 22 శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశం
నిద్ర సరిగ్గా పట్టదు- టైట్ గా ఉండే జీన్స్ లెగ్గిన్స్ వేసుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. ఇది బాడీ టెంపరేచర్ను తగ్గిస్తూ ఉంటుంది. దీని వల్ల గాలి ప్రసరణ సరిగా ఉండదు. ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల మీకు చాలా అసౌకర్యంగా ఉండి నిద్ర లేమి అనే సమస్య వస్తుంది.
రక్తప్రసరణ సరిగ్గా జరగదు- ఫ్యాషన్ కోసం చాలామంది టైట్ గా ఉండే బట్టలను వేసుకుంటూ ఉంటారు. ఇది అంత మంచిది కాదు దీని వల్ల చర్మం పైన నరాల పైన తీవ్ర ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి రక్తప్రసరణ సరిగ్గా జరగదు కాబట్టి అటువంటి ప్రదేశాల్లో వాపులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టైట్ గా ఉండే బట్టలు వేసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో సంతానం సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి మీరు టైట్ గా ఉన్న బట్టలను ఎక్కువ సేపు ధరించకుండా ఉంటేనే ఉత్తమం.
ఈ మార్పులు చేసుకోండి- సాధారణంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ముఖ్యంగా నిద్రపోయే సమయంలో సాధ్యమైనంత లూస్ గా ఉండే బట్టలను ధరిస్తే మంచిది. అందులో కాటన్ గా ఉండేటువంటి దుస్తులను వేసుకుంటే మన శరీరానికి ఎటువంటి సమస్యలు రావు.