Fashion Tips For Women: ఈ టిప్స్ ఫాలో అయితే మీ వయసు కంటే కూడా తక్కువగా కనిపిస్తారు..

ముఖ్యంగా మేకప్ వల్ల,హెయిర్ స్టైల్ కొంతమంది సరిగ్గా రాక వారి వయసు కంటే ఎక్కువ వయసుగా కనిపిస్తారు.

Representative Image (Photo Credits: IStock.com)

మనం అందంగా కనిపించాలంటే మన లైఫ్  స్టైల్ లో అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మేకప్ వల్ల,హెయిర్ స్టైల్ కొంతమంది సరిగ్గా రాక వారి వయసు కంటే ఎక్కువ వయసుగా కనిపిస్తారు. అయితే కొన్నిసార్లు మనం వేసుకునే డ్రెస్సులు కూడా మనని పెద్దవారు లాగా కనిపించేలా చేస్తాయి. అయితే కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అయితే మనము యంగ్ గా కనిపిస్తాము. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవనశైలి- చాలామంది ఏది పడితే అది తింటూ ఉంటారు. ఆరోగ్యం పైన శరీరం పైన కొంచెం కూడా శ్రద్ధ చూపించారు. అలాంటివారు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు విషయంలో నియంత్రణలో ఉంటారు. బరువుగా ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడు కూడా ఏజ్ ఎక్కువగా కనిపిస్తారు. అందుకే మీరు అధిక బరువు ఉన్నప్పుడు మీరు మీ వయసు కంటే ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మీరు రెగ్యులర్ వ్యాయామం చేయడం బరువు తగ్గడం వంటివి చేస్తే సహజంగానే మీకు మీ మొహం లో గ్లో రావడం యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది.

హెయిర్ స్టైల్- కొన్నిసార్లు హెయిర్ స్టైల్ కూడా మనని పెద్దవారిలా కనిపించేలాగా చేస్తుంది. హెయిర్ స్టైల్ ఒక్కొక్కసారి మళ్ళీ డామినేట్ చేస్తూ ఉంటాయి. అందంగా కనిపించాలన్న వికృతంగా కనిపించాలని మన హెయిర్ స్టైల్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం హెయిర్ స్టైల్ పైన కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మన మొహానికి ఏ హెయిర్ స్టైల్ బాగా సూట్ అవుతుందా వాటిని మాత్రమే ట్రై చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల హెయిర్ స్టైల్స్ వచ్చాయి. స్టైల్ చేయడం గర్ల్స్ చేయడం వంటివి మిమ్మల్ని యంగ్  కనిపించేలా చేస్తాయి. మీరు ఎప్పుడు కూడా పాపిడి తీయడం చేయకూడదు దీనివల్ల మీరు పెద్దవారిలా కనిపిస్తారు ఎప్పుడు కూడా సైడ్ పార్టీషన్స్ తీస్తే మీరు యంగ్ గా  కనిపిస్తారు.

Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..

మేకప్- మన వయసును పెంచాలన్న తగ్గించాలన్న మేకప్ అనేది చాలా ముఖ్యం. మనం మేకప్ అయినా ఎక్కువ దృష్టి పెట్టాలి. ట్రెడిషనల్ గా ఉండేవారు కొన్నిసార్లు రెగ్యులర్ చేసే తప్పు లు వల్ల ఏజ్ ఎక్కువగా కనిపిస్తారు. మనము మేకప్ చేసుకునేటప్పుడు బొట్టుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అది మీ లుక్ ను బెటర్ లాగా చేస్తుంది. మీ మొహానికి తగ్గట్టుగా బొట్టు సైజు ఉండేలా చూసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి పెద్ద బొట్టు హుందాగా కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని అది చాలా పెద్దవారు లాగా కనిపించేలాగా చేస్తుంది. కాబట్టి ఎక్కువగా చిన్న చిన్న బొట్టుకు ప్రాధాన్యత ఇస్తే మంచిది.

డ్రెస్సింగ్- డ్రెస్సింగ్ స్టైల్ కూడా మన పెద్ద వారిలాగా చూపిస్తుంది. ముఖ్యంగా రౌండ్ నెక్ ఉన్న బట్టలు వేసుకోవడం వల్ల మీరు పెద్దవారిలా కనిపిస్తారు. కాబట్టి వీ నెక్. టీ షర్ట్స్ ట్రై చేయండి. అంతేకాకుండా మీ డ్రెస్సులు ఎప్పుడు కూడా మీ స్కిన్ టౌన్ కి సూట్ అయ్యే విధంగా ఎంచుకోవాలి. మీరు అందంగా కనిపించడంలో మీ బట్టలు మేజర్ పాత్రను పోషిస్తాయి. కొన్ని కలర్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తాయి. కొన్ని కలర్స్ డల్ గా చేస్తాయి. ఇలాంటి టిప్స్ అని ఫాలో అయ్యి మీరు అందంగా కనిపించడం స్టార్ట్ చేస్తే మీరు ఉన్న ఏజ్ కంటే కూడా తక్కువగా యవ్వనంగా కనిపిస్తారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif