IPL Auction 2025 Live

Astrolog:వృషభ రాశిలో సూర్యుడు , గురుగ్రహ ప్రవేశం వల్ల ఈ 3 రాశుల వారికి శుభవార్తలు అందుతాయి, ఇంటికి చాలా డబ్బు వరదలా వస్తుంది.

ఈ రెండు గ్రహాల కలయిక మొత్తం 3 రాశుల వారికి చాలా శుభప్రదం. ఈ రాశుల వారు వ్యాపారం, ఉద్యోగ విజయాలను సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

astrology

ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన కదలికను , రాశిని మార్చుకుంటుంది. ఈ గ్రహాల రాశిచక్రంలోని మార్పులు మొత్తం 12 రాశుల వ్యక్తులపై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా, గ్రహాల రాజు అంటే సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మే 14న సూర్యుడు మేషరాశి నుంచి బయటకు వెళ్లి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత, సూర్యుడు ఈ రాశిలో ఒక నెల పాటు అంటే జూన్ 14 వరకు ఉంటాడు.

గురుడు, సూర్యుని కలయిక వృషభరాశిలో సంభవిస్తుంది.

సూర్య గ్రహ ప్రవేశం తరువాత, వృషభరాశిలో సూర్యుడు , గురుడు కలయిక ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక మొత్తం 3 రాశుల వారికి చాలా శుభప్రదం. ఈ రాశుల వారు వ్యాపారం, ఉద్యోగ విజయాలను సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేషం: మేష రాశి వారికి సూర్య సంచారం చాలా శుభప్రదం. ఈ సమయంలో, అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టుల్లో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతంది. ఊహించదగిన ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తే లాభాలు వస్తాయి. మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే అ ప్రయత్నం సక్సస్ అవుతుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. మీరు వైవాహిక జీవితంలో తలెత్తే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

సింహరాశి: వృషభరాశిలో గురు, సూర్యుల కలయిక సింహరాశికి లాభదాయకం. ఆఫిసులో ప్రమోషన్ కి అవకాశం ఉంటుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో మీరు శుభకార్యలలో పాల్గొంటారు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు మీ తల్లిదండ్రులతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పనిని ప్రారంభించబోతున్నట్లయితే, కచ్చితంగా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

కుంభం: కుంభ రాశిలో జన్మించిన వారికి సూర్య సంచారం శుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చు. ఉద్యోగ సమస్యలు తీరి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు మంచి సమయం, లాభాలను సంపాదించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.