Astrology: రాహు గ్రహం రాశి మార్పు కారణంగా..వచ్చే మూడు నెలల్లో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చేస్తుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కొన్ని రాశుల వారి పైన ప్రత్యేక అనుగ్రహాన్ని చూపి వారి జీవితాన్ని ఆనందంగా చేస్తుంది. డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చేస్తుంది. సుమారు 18 నెలల తర్వాత రాహు గ్రహం తన రాశిని మార్చుకుంటుంది, వచ్చే మూడు నెలల్లో ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు ఆ మూడు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి: రాహు రాశి మార్పు కారణంగా వృషభ రాశి వారికి రానున్న మూడు నెలల్లో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వారు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా అన్ని పూర్తి అవుతాయి. విద్యార్థులు వాళ్ళకేరి రంగంలో పురోగతి సాధించడానికి ఉపయోగపడుతుంది. వీరికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.

కన్యారాశి: ఈ రాశి వారికి రాహు ,రాశి మార్పు కారణంగా వారి జీవితాల పైన సానుకూల ప్రభావం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీనివల్ల మీరు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. వివాహితులకు మానసిక, శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. వచ్చే మూడు నెలల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు వ్యాపారం చేసినట్లయితే భారీ లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకున్న యువత కల నెరవేరుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

Astrology: సెప్టెంబర్ 30 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

మేషరాశి: మేష రాశి వారికి వచ్చే మూడు నెలలు రాహువు రాశి మార్పు కారణంగా మీ వ్యాపారం ముందుకు వెళ్తుంది. వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి చేసే కొత్త విధానాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. స్నేహితులతో గడిపే సమయం లభిస్తుంది. మీ భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేసే వారికి జీతం పెరుగుతుంది. షేర్ మార్కెట్ నుండి కూడా మంచి లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



సంబంధిత వార్తలు