Astrology, Shravana Masam: జూలై 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ 5 రాశులంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం, ఈ మాసంలో కోటీశ్వరులు అయ్యే చాన్స్, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
ఈ మాసంలో సకల శుభకార్యాలు చేసుకోవడానికి చాలా మంచిదని చెబుతూ ఉంటారు.
జూలై 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది శ్రావణమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైన నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో సకల శుభకార్యాలు చేసుకోవడానికి చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వివాహం, గృహప్రవేశము, వ్యాపారం ప్రారంభము వంటివి చేసుకోవడం ద్వారా మీరు జీవితంలో రాణించవచ్చు. అయితే శ్రావణమాసంలో ఐదు రాశుల వారికి చక్కగా కలిసి వస్తుందని లక్ష్మీదేవి కృప ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శ్రావణమాసం ఒక రకంగా అదృష్టమే అని చెప్పాలి ఈ రాశి వారు శ్రావణమాసంలో అన్ని శుభాలు జరుగుతాయి అంతేకాదు మీరు ఏ పని ప్రారంభించిన విజయం చేకూరుతుంది ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు అందుకుంటారు దాంతోపాటు ఈ నెలలో లాటరీ సైతం లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ధన లాభం కలిగే అవకాశం పుష్కలంగా ఉంది.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
కన్యా రాశి
ఈ రాశి వారు శ్రావణమాసంలో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీతో పాటు ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి భాగస్వామి లభించే అవకాశం ఉంది. అలాగే కన్యారాశి వారు శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయడం ద్వారా మరింత శ్రేయస్కరం అని చెప్పవచ్చు.
మిధున రాశి
ఈ రాశి వారికి శ్రావణమాసం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి ఆరంభం అని చెప్పవచ్చు. లక్ష్మీదేవికి మిధున రాశి అంటే చాలా ఇష్టమైన రాశి. మిధున రాశి వారిపై శ్రావణమాసంలో లక్ష్మీదేవి కృప ఉంటుంది కావున మీరు వ్యాపారం ప్రారంభిస్తే మాత్రం మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ రాశి వారికి ధనయోగం కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఖర్చు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కుంభరాశి
ఈ రాశి వారికి శ్రావణమాసం ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కలిసి వస్తాయని చెప్పవచ్చు. అదృష్టం వీరిని వరిస్తుంది ఈ మాసంలో, మీరు శుభవార్తలను వింటారు. అలాగే మీ కుటుంబంలో మీ పిల్లలు విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది నిరుద్యోగులు విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రాశి వారికి శ్రావణమాసం ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ప్రధానంగా ఈ మాసంలో వ్యాపారం చేసిన వారికి బోలెడు లాభాలు వస్తాయి అలాగే కన్నెపిల్లలకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించే అవకాశం ఉంది. నిరుద్యోగులు శ్రావణమాసంలో మంచి శుభవార్త వింటారు.