Astrology: హనుమంతునికి ఇష్టమైన 4 రాశులు ఇవే...ఈ రాశుల వారికి ఇకపై పట్టిందల్లా బంగారమే..ధన కుబేరులు అవుతారు..

Astrology: హనుమంతునికి ఇష్టమైన 4 రాశులు ఇవే...ఈ రాశుల వారికి ఇకపై పట్టిందల్లా బంగారమే..ధన కుబేరులు అవుతారు..

astrology

మిథునం: ఈ రాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లయితే అవన్నీ కూడా ఫలిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారు కూడా ఆ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే చక్కటి ఫలితం లభించే అవకాశం ఉంది. లాటరీ టికెట్ వంటివి కొన్నట్లయితే అది మీకు తగిలే అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధిత విషయాల్లో గొడవలు ఉంటే సమస్య పోతాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు లాంటివి ఉంటే మధ్య మార్గం వల్ల శాంతి ఏర్పడుతుంది. వీరభద్ర స్వామిని పూజించండి.

కర్కాటకం: ఈ రాశికి చెందిన వారు వ్యవసాయ రంగంలో చక్కగా రాణిస్తారు. వర్షాలు బాగా కురవడం వల్ల వ్యవసాయ రంగంలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు అతి త్వరలోనే మంచి శుభవార్త వింటారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి శుభవార్త వింటారు. దుర్గాదేవిని పూజించండి.

ధనస్సు: ఈ రాశికి చెందిన వారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి ఫలితం కలలు సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే, మీరు త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో మీరు రాణిస్తారు. కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు మీకు కలిసి వస్తాయి. కుటుంబ జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీ సంతానం నుంచి మంచి పేరు లభిస్తుంది. రావి చెట్టుకు మంచినీరు పోయండి.

మకరం: ఈ రాశికి చెందిన వారు అతి త్వరలోనే అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్నవారు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభం వల్ల మీరు ధనవంతులవుతారు. నూతన గృహప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. నూతన వాహనం కూడా కొనుగోలు చేస్తారు. మీ స్నేహితుల వల్ల లాభం పొందే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆవుకు బెల్లం తినిపిస్తే మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement