Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే పొరపాటున కూడా ఈ 5 వస్తువులను దానం చేయకండి..

ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణాలు మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనము దానం చేయకూడని వస్తువులు దానం చేస్తూ ఉంటాము.

laxmi devi

చాలామంది కుటుంబాలలో లక్ష్మీ అనుగ్రహం ఉండక ఆ ఇల్లు చాలా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణాలు మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనము దానం చేయకూడని వస్తువులు దానం చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి .అయితే పొరపాటున కూడా ఇటువంటి వస్తువులు దానం చేయకూడదు. ఇలా దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోతుంది. అటువంటి వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నూనె- మనం ఉపయోగించే వంట నూనెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి దానం చేయకూడదు. ఇలా దానం చేయడం వల్ల తీసుకున్నవారు ఇచ్చినవారు ఇద్దరు కూడా పేదరికంలోకి కూరుకుపోతారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాడేటువంటి నూనెను ఇవ్వకూడదు. దీని వల్ల ఆర్థిక నష్టం జీవితంలో బాధాకరము కుటుంబం కష్టాల్లో కూరుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

Vastu Tips: నల్లచీమలు ఇంట్లో కనిపిస్తే మంచిదేనా, 

పదునైన వస్తువులు- ఎవరికి కూడా ఎప్పుడు చాకు, కత్తెర, కత్తిపీట వంటి పదునైన వస్తువులు ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం వల్ల దానం చేసిన వారికి ,తీసుకున్న వారికి ఎప్పుడు కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో శాంతి అస్సలే ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ ఏర్పడుతుంది. కొన్నిసార్లు విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి.

చీపురు- చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇంట్లో ఉన్న చీపిరిని ఎవరికి దానం చేయకూడదు. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ కుటుంబం పైన ఉండదు. ఆ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది. దీని కారణంగా ఆ కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురును ఎవరికి దానం చేయకూడదు..

చిరిగిన పుస్తకాలు, దుస్తులు- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా చదవడానికి పుస్తకాలు ఇవ్వాలి అంటే వారికి కొత్త పుస్తకాలు ఇవ్వాలి. అదే విధంగా బట్టలు కూడా కొత్త బట్టలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. చిరిగిపోయిన పాత పుస్తకాలను బట్టలను ఇవ్వడం ఆశుభం. ఇలా చేయడం వల్ల మీ అదృష్టం బలహీనపడుతుంది. అంతేకాకుండా మీకు జీవితంలో లేనిపోని కష్టాలు ఏర్పడతాయి.

పాడైపోయిన ఆహారం..చాలామంది పాడైపోయిన ఆహారాన్ని దానం చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ లో ఉంచిన పాత ఆహారాన్ని ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంలో చాలా నష్టాలు ఏర్పడతాయి. కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా ఖర్చు అవుతుంది. ఎప్పుడు కూడా అనారోగ్యంగా ఉంటారు. ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా దానం చేయాలి అంటే మంచి ఆహారాన్ని ఇవ్వడం ఉత్తమం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif