Basava Jayanti 2023 Images & Basaveshwar Jayanti HD Wallpapers for Free Download Online: రేపే బసవ జయంతి.. బసవేశ్వర మహారాజ్ ఫోటోలు, హెచ్ డీ వాల్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి..

రేపు బసవేశ్వర జయంతి. బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకరు. ఆయన సమాజంలో కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని సుమారు గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పారు.

Basava Jayanthi

Newdelhi, April 22: రేపు బసవేశ్వర జయంతి. బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకరు. ఆయన సమాజంలో కుల,వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని సుమారు గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పారు. అందుకనే బసవేశ్వరుడిని బసవన్న, బసవుడు, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు. కర్ణాటకలోని బాగేవాడి బసవేశ్వరుడి జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అభ్యసించాడు.  ఉపనయనం చేస్తున్న తల్లిదండ్రులను వదలి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం దగ్గరకు చేరి.. అక్కడ ఉన్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించాడు. 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశారు. శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నారు. అలా లింగాయత మతానికి బీజాలు వేశారు. కాగా, రేపు బసవ జయంతి సందర్భంగా.. బసవేశ్వర మహారాజ్ ఫోటోలు, హెచ్ డీ వాల్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..

National Youth Day, Swami Vivekananda Jayanti 2025 Wishes: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు వివేకానందుడి కోటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..

National Youth Day 2025, Swami Vivekananda Jayanti Wishes: నేడు స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం మీ బంధు మిత్రులకు స్వామి వివేకానంద కొటెషన్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

Health Tips: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా, ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం..

Share Now