Ganesh Chaturthi: దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ, ప్రతి ఇంటిలో- వాడవాడలో కొలువుదీరిన గణనాథుడు. వినాయక చవితిని ఏ రోజు జరుపుకుంటారు, మరియు వినాయకుడి ఉన్న విభిన్నమైన పేర్లను ఇక్కడ తెలుసుకోండి.
గణేశ చతుర్ధి సందర్భంగా భక్తులు గణపతి విగ్రహాలను ఊరూరా, వాడవాడలా ప్రతిష్టిస్తారు. తమ ఇండ్లలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, గౌరవంతో గణేశుడుని ప్రతిమను ఇంట్లో కొలువుదీర్చి, రోజూ దీపధూపనైవేద్యాలను సమర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు మరియు భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు..
Hyderabad, September 2: పార్వతీదేవి ముద్దు బిడ్డ గణేషుడి పుట్టిన రోజునే గణేశ చతుర్థి లేదా వినాయక చవితి పండగను జరుపుకుంటాము. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపాద నెలలోని నాలుగవ రోజు వినాయక చవితిగా జరుపుకుంటారు. యావత్ భారత దేశమంతటా హిందువులు ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో గణేశ్ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2, సోమవారం రోజున వినాయక చవితి రోజుతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సెప్టెంబర్ 12 అనంత చతుర్ధశి వరకు కొనసాగుతాయి.
వినాయకుడిని చాలా పేర్లతో పిలుస్తారు. గణేశ్, ప్రతమేశ్, గణపతి, వినాయక మరియు శ్రీ విఘ్నేశ్వరాయ అంటూ ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అతని ప్రతి పేరు అతడికి గల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
గణనాథుడుకి స్థూలంగా 108 పేర్లు ఉన్నట్లు ప్రతీతి. అవేంటంటే...
గజానన
గణాధ్యక్ష
విఘ్నరాజ
వినాయక
ద్వైమాతుర
ద్విముఖ
ప్రముఖ
సుముఖ
క్రితి
సుప్రదీప
సుఖనిధి
సురాధ్యక్ష
సురారిగణ
మహా గణపతి
మాన్య
మహాకాల
మహాబల
హెరాంబ
లంబోదర
హస్వగ్రీవ
మహోధర
మడోత్కత
మహావీర
మంత్ర/ మాంత్రినే
మంగళ స్వర
ప్రమధ
ప్రథమేశ
ప్రజ్ఞా
విఘ్నకర్త
విఘ్నహర
విశ్వనేత్ర
విరాట్పతి
శ్రీపతి
వాక్ పతి
శృంగారిన్
ఆశ్రిత వత్సల
శివప్రియ
శ్రీఘ్రకారిన
శాశ్వత
బాలా
బలోత్తితయ్య
భవత్మజయ
పురాణ పురుష
పుష్నే
పుష్కరొత్షిప్తా వరినే
అగ్రగన్య
అగ్రపూజ్యయ
అగ్రగామి
మంత్రకృతే
చామికరప్రభాయ
సర్వయ
సర్వోపస్యయ
సర్వకార్త్రే
సర్వనేత్రే
సర్వసిద్ధిప్రదయ
సిద్ధయే
పంచహస్తయ
పార్వతినందనాయ
ప్రభవ
కుమార గురవే
అక్షోభ్యాయ
కుంజరసుర భంజనయ
ప్రమోదాయ
మోడకాప్రియ
కాంతిమతే
ధ్రితిమతే
కామినే
కపిత్తపనసపియయే
ఓం బ్రహ్మచారినే నమ:
బ్రహ్మరూపిణే
బ్రహ్మవిద్యాది దానభువే
జిష్ణు
విష్ణుప్రియయ
భక్త జీవితయ
జితమన్మాధయ
శ్వర్యకరనాయ
జయసే
యక్ష కిన్నరసేవితయ
గంగా సుతయ
గణాధిశయ
గంభీరా నినాదయ
వటవే
అభిష్టవరదయ
జ్యోతిషే
భక్తానిధాయే
భవగమ్యాయ
మంగళ ప్రదాయ
అవ్యక్తయ
పరాక్రమమయ
సత్యధార్మినే
సఖ్యే
సరసంబునిధాయే
మహేశాయ
దివ్యాంగాయ
మణికింకిని మేఖాలయ
సమాస్తా దేవతా మూర్తాయే
సాహిష్నవే
సతతోత్తితయ
విఘాటకరిన్
విశ్వఋషే
విశ్వరక్షాకృతే
కళ్యాణగురవే
ఉన్మత్తవేశాయ
అపరాజితే
సమస్త జగద్ ధరాయ
సర్వ ఐశ్వర్య ప్రదాయ
అక్రాంత చిదా చిత్ ప్రభవే
శ్రీ విఘ్నేశ్వరాయ
గణేశ్ ఉత్సవాలు పది రోజుల పాటు జరిగే పండుగ. గణేశ చతుర్ధి సందర్భంగా భక్తులు గణపతి విగ్రహాలను ఊరూరా, వాడవాడలా ప్రతిష్టిస్తారు. తమ ఇండ్లలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, గౌరవంతో గణేశుడుని ప్రతిమను ఇంట్లో కొలువుదీర్చి, రోజూ దీపధూపనైవేద్యాలను సమర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు మరియు భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా ముంబై, హైదరాబాద్ మరియు పుణె నగరాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసిన విభిన్న గణనాథుడి విగ్రహాలతో చూడముచ్చటగా అనిపిస్తుంది, అధ్యాత్మక భావన కలుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదులో జరిగే గణేశ్ ఉత్సవాలు కన్నుల పండుగగ జరుగుతాయి. నగరవ్యాప్తంగా వందల వేల గణనాథులు కొలువుదీరుతాయి. ఈ పదిరోజులు జరిగే ఉత్సవాలు ఒక ఎత్తు, చివరి రోజు మరో ఎత్తు. ఆటపాటలతో, తీన్మార్ డాన్సులతో హోరెత్తిపోతుంది.
ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ బడా గణేశ్ ఈ ఏడాది "శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి" గా దర్శనమిస్తున్నాడు. 61 అడుగుల ఎత్తు, 12 తలలు, 24 చేతులు మరియు 12 సర్పాలతో ఎప్పట్లాగే భారీగా కొలువుదీరి ఉన్నాడు.
తెలుగు రాష్ట్రంలో వినాయకుడిని ఎంత ఘనంగా ఆహ్వానిస్తారో, అంతే ఘనంగా కొలుస్తారు, అంతే ఘనంగా సాగనంపుతారు. ఈ గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రజలందరికి అనుకున్న కార్యాలన్నీ సకాలంలో పూర్తికావాలని కోరుకుందాం.