Ambedkar Jayanti 2023, Inspirational Ambedkar Quotes : అంబేద్కర్ చెప్పిన ఈ మాటలను ఆచరణలో పెడితే మీరు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు..

బాబా సాహెబ్ అంబేద్కర్ అనే పేరు తెలియని వారు ఉండరు. రాజ్యాంగ నిర్మాత, దళితుల హక్కుల కోసం, సామాజిక హక్కుల కోసం అంబేద్కర్ తన జీవితమంతా అంకితం చేశారు. అటువంటి మహానుభావుని అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు. అంబేద్కర్ అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు అలాంటి అంబేద్కర్ కొటేషన్స్ మీ కోసం..

(Photo-Twitter)

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకుంటారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అనే పేరు తెలియని వారు ఉండరు. రాజ్యాంగ నిర్మాత, దళితుల హక్కుల కోసం, సామాజిక హక్కుల కోసం అంబేద్కర్ తన జీవితమంతా అంకితం చేశారు. అటువంటి మహానుభావుని అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు. అంబేద్కర్ అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు అలాంటి అంబేద్కర్ కొటేషన్స్ మీ కోసం..

>> ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం.

>> ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావం చూపలేరు.

>> ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.

>> వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే హీనుడు

> రాజ్యాంగాన్ని నమ్ముకుంటే రాష్ట్రపతిని చేస్తుంది. మతాన్ని నమ్ముకుంటే మళ్ళీ నిన్ను బానిసగా తయారు చేస్తుంది.

Astrology : ఏప్రిల్ 16 నుంచి వ‌చ్చే 27 రోజుల వర‌కు ఆ రాశుల వారికి డ‌బ్బే డ‌బ్బు

>> స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ, బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు

>> మేకల్ని బలిస్తారు, కానీ పులులను బలివ్వరు.. కాబట్టి పులుల్లా బతకండి…!

>> ఆశయాలను ఆచరణలో పెడితే మహానీయులవుతారు.

>> నీ బానిసత్వాన్ని నీవే పోగొట్టుకోవాలి. దేవుడి మీదకాని, మహానుభావుల మీద కానీ ఆధార పడకు

>> ఏ కారణము లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేసే పనిలో విజయం సాదిస్తావని అర్థం.

>> మనల్ని మనం తప్ప ఎవరూ రక్షించరు. మనమే దారిలో నడవాలి

>> కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్ట

>> ఏ కారణం లేకుండా నీ పై విమర్శలు వస్తున్నాయంటే నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం.

>> జీవితం సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలి..!

>> గెలిచినా, ఓడినా రేపు మనదే, తీర్చుకోవడానికి నిన్న మనది కాదు.

>> తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగా చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు.