Karthika Pournami 2024 Wishes In Telugu: కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..
ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.
సనాతన ధర్మంలో హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలో కార్తీక పౌర్ణమి కూడా ఒకటి ఈరోజు పరమశివుడితోపాటు శ్రీమహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టమైన పర్వదినం. అయితే ముఖ్యంగా పరమశివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనదిగా పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు అత్యంత ముఖ్యమైన పండుగగా దీన్ని భావిస్తారు. అలాగే పురాణాల్లో సైతం కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పూజల గురించి వ్రత విధానాల గురించి అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టతతో కూడుకున్నది ఈ రోజున మీరు 365 వత్తులతో దీపం వెలిగించినట్టయితే సంవత్సరం పొడుగుతా భగవంతుడి ఎదుట దీపం వెలిగించడంతో సమానంగా భక్తులు భావిస్తారు. సనాతన ధర్మంలో కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి సాక్షాత్తు పరమశివుడు పేర్కొన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.
మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
పరమశివుడి అనుగ్రహంతో మీరు సకల విజయాలను పొందాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
శివుడి అనుగ్రహంతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
సకల లోకైక నాథుడు పరమశివుడు నేడు మీరు కోరుకున్న ప్రతి పనిలోనూ విజయం అందేలా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
ఈ కార్తీక పౌర్ణమి పండగ మీ జీవితంలో సకల శుభాలను వెలుగులను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.