Shani Jayanti 2022: మే 30న శని జయంతి రోజు శనీశ్వరుడిని ఇలా పూజిస్తే, జీవితంలో నుంచి శని బయటకు వెళ్లిపోతుంది..శని పూజ, నియమాలు ఏమిటంటే..

శనీశ్వరుడికి కోపం వస్తే.. మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ ఏడాదిలో రానున్న శని జయంతి గురించి తెలుసుకుందాం.

file photo

Shani Jayanti 2022: దేవతల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడికి కోపం వస్తే.. మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ ఏడాదిలో రానున్న శని జయంతి గురించి తెలుసుకుందాం. శని జయంతి ఏ తేదీన రాబోతుంది. ఏ విధమైన పూజలను చేసి.. శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చో ఈరోజు తెలుసుకుందాం.. శనీశ్వరుడికి ఇష్టమైన రోజున, ప్రజలు పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేస్తారు. హిందూమతంలో దానధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దానం చేసే వారిని శని దేవుడి అత్యంత పియ్రమైనవారిగా భావిస్తాడని నమ్మకం. శని జయంతి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.

శని జయంతి తేదీ, సమయం:

ఈ ఏడాది శని జయంతి 30 మే 2022, సోమవారం వచ్చింది. శుభ సమయం మే 29 ఆదివారం మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమవుతుంది. మే 30వ తేదీ సాయంత్రం 4:59 వరకు కొనసాగుతుంది. ఈసారి అయితే ఉదయమే తిథి రావడంతో మే 30న శని జయంతి జరుపుకోనున్నారు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ఆవనూనె తో పూజ :

శని జయంతి రోజు ఉదయం తలస్నానం చేసే ముందు ఆవాల నూనెతో మర్దన చేసి తలస్నానం చేయాలి. అనంతరం వంటగదికి వెళ్లి శనీశ్వరుడికి ఆవనూనెతో చేసిన వంటలను సిద్ధం చేసి పూజలను నిర్వహించండి. నల్ల నువ్వులు, ఆవనూనె దీపం, ఇతర వస్తువులతో పూజను నిర్వహించాలి. ప్లేట్‌తో గుడికి వెళ్లి శని దేవుడికి సమర్పించండి. ఆరోజు శని చాలీసాను పఠించండి.

రావి చెట్టు ఆరాధన:

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి లేదా అతని కోపాన్ని నివారించడానికి రావి చెట్టును పూజించడం విశిష్టమని నమ్మకం. శని జయంతి రోజున రావి చెట్టుకు పూజ చేసి.. పూజాద్రవ్యాలు సమర్పించాలి. అనంతరం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వలన శని దోషాలు నివారింపబడతాయని నమ్మకం.