Telugu Language Day 2024 Wishes: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలపండిలా..?
ఇక భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు భాషకు పేరు ఉంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేము బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇక్కడ పేర్కొన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి.
నేడు తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29వ తేదీన ప్రముఖ భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని ఈ పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఎవరికైతే తెలుగు భాష పట్ల అభిమానం ఉంటుందో వారందరూ కూడా ఈరోజు సభలు సమావేశాలు నిర్వహించి తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష అత్యధికంగా మాట్లాడే భాషల్లో 15వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా తెలుగువారు విస్తరించి ఉన్నారు. అమెరికాలో సైతం తెలుగు భాష రెండవ అతిపెద్ద విదేశీ భాషగా హిందీ తో సమానంగా పేరు తెచ్చుకుంది. ఇక భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు భాషకు పేరు ఉంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేము బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇక్కడ పేర్కొన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి.
వృత్తికొరకు భుక్తికొరకు ఏ భాషను నేర్చినా, సొంతపాట పాడలేమ ఇంటిపట్టున.. ఎంత ఎత్తుకెదిగినా ఏ రాజ్యాలేలినా, అవసరమే కదా మనకు అమ్మ దీవెన.. తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
దేశభాషలందు తెలుగు లెస్స. తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
మాతృభాషలో ఉన్న అమ్మదనం మరే భాషలో కనిపించదు. ఎందుకంటే మన మనస్సు ఆలోచించేది మన మాతృభాషలోనే... తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
తెలుగు వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి కృషి చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని 'తెలుగు భాషా దినోత్సవం'గా జరుపుకుంటున్న సందర్భంగా తెలుగుభాషాభిమానులందరికీ శుభాకాంక్షలు
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, శ్రీ "గిడుగు వెంకట రామమూర్తి". గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. వారి జన్మదినం సందర్భంగా, తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.