Turmeric Milk Benefits: పాలల్లో, చిటికెడ్ పసుపు కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అయితే పిల్లల్లో ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు సీజన్లలో చీటికిమాటికి జలుబు దగ్గు జ్వరం ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
వర్షాకాలం చలికాలంలో అందర్నీ వేధించే సమస్య జలుబు దగ్గు రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతోటి ఈ సమస్యలన్నీ ఏర్పడతాయి. అయితే పిల్లల్లో ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు సీజన్లలో చీటికిమాటికి జలుబు దగ్గు జ్వరం ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు మరియు పెద్దలు అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి మన వంటింట్లోనే ఒక దివ్య ఔషధం ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో జలుబు దగ్గుతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా చుట్టూ ముడతాయి. అందువల్ల పిల్లలు మరియు పెద్దలు బలహీన పడుతుంటారు. దీనికి ముఖ్య కారణం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం దీన్ని మనము పెంచుకోవడానికి ఇప్పుడు ఒక ఔషధం గురించి తెలుసుకుందాం.
దీనికి కావలసినవి పాలు, చిటికెడు పసుపు పాలల్లో విటమిన్లు మినరల్స్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ ఫంగల్ గాను ఉపయోగపడుతుంది. పసుపులో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. కనుక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగినట్లయితే మీ రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. దీని ద్వారా అన్ని కాలాల్లోనూ ముఖ్యంగా చలికాలంలోనూ వర్షాకాలంలోనూ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ భారి నుండి బయటపడవచ్చు. దీనిని పిల్లలు పెద్దలు అందరు కూడా తాగవచ్చు.