Bairi Naresh’s remarks on Lord Ayyappa (PIC @ Screen Garb from viral video)

Hyderabad, DEC 30: అయ్యప్ప స్వామి గురించి ఓయూ స్టూడెంట్ బైరి నరేశ్ (Bairi Naresh) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్గి రాజేశాయి. నరేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు (Ayyappa Devotees) తీవ్రంగా మండిపడుతున్నారు. నరేశ్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు నరేశ్ పై కొడంగల్ (Kodangal) పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలను ఉపేక్షించబోమని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి హెచ్చరించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదన్నారు. బైరి నరేశ్ కు చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామన్నారు. ఎవరో ఆందోళన చెందొద్దని, ఇలాంటి వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అన్నారు. నాస్తిక సభ నిర్వాహకులు ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించొద్దని ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలు (Ayyappa Devotees) దెబ్బతీసేలా హిందువుల దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరేశ్ పై మండిపడుతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన అంబేద్కర్ సభలో (Ambedkar Sabha) భైరి నరేశ్.. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో తెలంగాణ వ్యాప్తంగా వైరల్‌ కావడంతో అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్ పై మండిపడుతున్నారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్‌ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేశ్. అయ్యప్ప స్వామి జననాన్ని, పురాణాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

ఎంతోమంది నమ్మకంగా కొలిచే అయ్యప్పస్వామిని (Ayyappa) కించపరుస్తూ నరేశ్ మాట్లాడం దుమారం రేపింది. దీనిపై అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగారు. భైరి నరేశ్ ను వెంటనే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవుళ్లను తిట్టడం ప్రతోడికి ఫ్యాషన్ గా మారిందని, హిందువుల దేవుళ్లను దూషిస్తే బాగా పబ్లిసిటీ వస్తుందని కొందరు ఇలా దిగజారిపోతున్నారని అయ్యప్ప భక్తులు మండిపడ్డారు.  Ayyappa Swamy devotees