Ugadi 2023: ఉగాది రోజు పొరపాటున కూడా ఈ పని చేశారో ఏడాది మొత్తం చాలా నష్టపోతారు, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా పాటించాల్సిన నియమాలు ఇవే...

పైగా ఇది మొదటి పండుగ కనుక ఏడాది అంతా కూడా ఆనందంగా ఉండాలని మంచి జరగాలని కోరుకుంటారు. వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే ప్రతి ఒక్కరిలో కూడా కొత్త చైతన్యం కలుగుతుంది. అయితే ఉగాది రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి..?

Latest Ugadi Wishes in Telugu

తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి. పైగా ఇది మొదటి పండుగ కనుక ఏడాది అంతా కూడా ఆనందంగా ఉండాలని మంచి జరగాలని కోరుకుంటారు. వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే ప్రతి ఒక్కరిలో కూడా కొత్త చైతన్యం కలుగుతుంది. అయితే ఉగాది రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి..?

ఆ రోజు ఎలాంటి వాటిని అనుసరించడం వల్ల మంచి కలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అదే విధంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని పండితులు చెప్పడం జరిగింది. అయితే మరి వేటికి దూరంగా ఉండాలి ఏ పనులు చేయాలి అనేది తెలుసుకుందాం.

ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో అద్భుతమైన మెసేజెస్ మీకోసం, మీ బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది విషెస్ చెప్పేయండి

ఉగాది నాడు చేయకూడని పనులు:

>> ఆలస్యంగా నిద్రలేవడం

>> మాంసాహారం మద్యం వంటివి తీసుకోవడం లాంటివి చేయకూడదు

>> అలానే దక్షిణ ముఖంగా కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు.

>> ఇలా ఉగాది రోజు ఈ తప్పుల్ని చేయకుండా ఉంటే మంచి కలుగుతుంది.

ఉగాది రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు:

>> ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది.

>> అలానే పూర్వికులు అయితే ఒక విసినకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు.

>> కొత్తబట్టలు ధరించడం, కొత్త ఆభరణాలు వేసుకోవడం ఉగాది రోజు మామూలే.

>> అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం పొందవచ్చు. పూర్వం అయితే విసనకర్రలు దానం చేసేవారు.

>> ఇదిలా ఉంటే ఉగాది రోజున దమనం తో పూజ చేయాలి. దమనమనేది సుగంధం తో ఉండే ఆకు. దీనితో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు. అలానే పాడ్యమినాడు బ్రహ్మ కి, విదియ నాడు శివుడికి, >> తదియనాడు గౌరీశంకర్లకి, చతుర్థి నాడు వినాయకుడికి పూజ చేస్తే మంచిది. ఇలా పౌర్ణమి వరకు పూజించాలి.

>> అలాగే ఉగాది రోజు పచ్చడి చేసుకుని తినాలి. ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది దీనికి చాలా విశిష్టత ఉంది.