Latest Ugadi Wishes in Telugu

Latest Ugadi Wishes in Telugu: తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అనగా ఈ ఏడాది ప్రారంభమని.. మన తెలుగు వారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఉగాది శుభాకాంక్షలు తెలిపే అద్భుతమైన కోట్స్, తెలుగులో మీ బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది విషెస్ చెప్పేయండి

షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.

ఉగాదికి ముందే ఇంట్లో ఈ పాత వస్తువులను బయటకు విసిరేయండి.

ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈరోజున పంచాంగ శ్రవణం చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఎవరి భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాంగం వినిపిస్తారు. ఈ సంవత్సరాన్ని శోభకృత్ నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. మీ కోసం ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కోట్స్

Latest Ugadi Wishes in Telugu

తీపిలోని ఆనందం, చేదులోని దుఖం, కారంలోని అసహనం

పులుపులోని ఆశ్చర్యం, ఉప్పులోని ఉత్సాహం, వగరులోని పొగరు- సాహసం.

అన్ని రుచులను స్వీకరించినపుడే  జీవితానికి ఒక అర్థం.

ఏదేమైనా ముందడుగు వేయమని చెప్పేదే ఉగాది పర్వదినం

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

Latest Ugadi Wishes in Telugu

గుమ్మానికి లేత మామిడి తోరణాలు

గడపకు స్వచ్ఛమైన పసుపు పూతలు

వాకిళ్లకు అలుకుతో పలికే స్వాగతాలు

ప్రకృతి వరప్రసాద షడ్రుచుల స్వీకారాలు

మన సాంప్రదాయాలే తొలగిస్తాయి సమస్త చీడపీడల రోగాలు.

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Latest Ugadi Wishes in Telugu

చైత్రమాసాన వసంత ఋతువులో కొత్త పూతలతో, కోయిల రాగాలతో ప్రకృతి సోయగాల నడుమ వచ్చే ఉగాది పడంగ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతూ మనస్సులో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆలోచనలను నింపుతుంది.

Ugadi Messages in Telugu

ఈ పండగను కర్ణాటకలో యుగాది, మహారాష్ట్రలో గుడిపాడ్వా, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు అనే పేర్లతో పులుస్తారు. సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గా జరుపుకుంటారు.