ఉగాది నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని వ్యాప్తి చేసే వస్తువులను ఈ సందర్భంగా పారేయండి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఉగాది చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని ప్రతిపద తిథి నుండి ప్రారంభమవుతుంది. చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈసారి ఉగాది మార్చి 22న వస్తోంది. ఉగాదికి ముందు ప్రతి ఇంటిలో క్లీనింగ్ మొదలవుతుంది. చెత్తను తొలగించడం, రంగులు వేయడం వంటివి చేస్తుంటారు. శుభ్రపరిచేటప్పుడు, ఇంట్లో అనవసరమైన వస్తువులను విసిరేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఇంట్లో నెగిటివిటీని వ్యాప్తి చేయడానికి తప్ప దేనికీ ఉపయోగపడవు. ఉగాది లోపు ఇంట్లోంచి తీసేయాల్సిన వస్తువులను చూద్దాం.
విరిగిన విగ్రహాలు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలను ఎప్పుడూ పగలగొట్టకూడదు. విగ్రహం ఎక్కడైనా కాస్త విరిగితే ప్రవహించే నీటిలో పడేయాలి.
పాడైపోయిన గడియారం: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఆగిపోయిన వాచ్ ఉంటే అదృష్టం కూడా ఆగిపోతుంది. అందువల్ల, ఇంట్లో గడియారం పనిచేయడం ఆగిపోతే దాన్ని బాగు చేయాలి లేదా విసిరివేయాలి. ఎందుకంటే ఆగిపోయిన గడియారం వ్యక్తి పురోగతి మరియు ఆర్థిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి విరిగిన గడియారాన్ని రిపేరు చేయండి లేదా వెంటనే చూడండి లేదా విసిరేయండి.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
బ్రోకెన్ గ్లాస్: వాస్తు శాస్త్రం ప్రకారం, పగిలిన గాజు లేదా దానితో చేసిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. కాబట్టి పగిలిన గాజు వస్తువులను ఇంట్లో ఉంచవద్దు.
చిరిగిన పుస్తకాలు: వాస్తు శాస్త్రం ప్రకారం, చిరిగిన పుస్తకాలను ఇంట్లో ఉంచకూడదు. వాటిని పాత సామాన్ల వారికి వేసేయండి.
పాత కుంకుమ, పసుపు: కుంకుమ, పసుపును ప్రతీ ఉగాది రోజు కొత్తవి ఇంట్లో తెచ్చుకోవాలి. పాత వాటిని నీటిలో వేయాలి.
ఈసారి ఉగాదికి ఇంటిని శుభ్రం చేసేటపుడు ఇంట్లోని అన్ని మందుల ఎక్స్‌పైరీ డేట్‌ని చెక్ చేయండి. గడువు ముగిసిన వాటిని వెంటనే విసిరేయండి.