Happy-Ugadi 2023

Latest Ugadi Wishes in Telugu: తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అనగా ఈ ఏడాది ప్రారంభమని.. మన తెలుగు వారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది.

శ్రీశైలం మహాక్షేత్రంలో రెండవ రోజు ఘనంగా ఉగాది మహోత్సవాలు, మహాదుర్గ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.

దుర్గా మాత భక్తులు మార్చి 22 నుంచి 30వ తేదీ వరకూ వీటిని తినకుండా జాగ్రత్తగా ఉంటే, జీవితంలోని కష్టాలు, అప్పులు, బాధలు పోయి సుఖంగా ఉంటారు.

ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈరోజున పంచాంగ శ్రవణం చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది.ఈ పండగను కర్ణాటకలో యుగాది, మహారాష్ట్రలో గుడిపాడ్వా, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు అనే పేర్లతో పులుస్తారు. సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గా జరుపుకుంటారు.

ఈ ఏడాది ఎవరి భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాంగం వినిపిస్తారు. ఈ సంవత్సరాన్ని శోభకృత్ నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఈ విశేషమైన పండుగ రోజున మనం చేసే ప్రతీ పని మనలో తెలియని ఆనందం, ఆత్మ సంతృప్తిని తెస్తుంది. ఈ సందర్భంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నాసరే వారికి వాట్సాప్, ఫేస్ బుక్, షేర్ చాట్ వంటి వాటి Ugadi Wishes, Images ద్వారా అద్భుతమైన మెసేజ్ లు, విషెష్ లు పంపేసుకుందాం. ఆత్మీయబంధాన్ని గట్టిగా పెంచుకుందా. మీ కోసం ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కోట్స్..

Happy-Ugadi Wishes

మనిషి జీవితం సకల అనుభూతుల మిశ్రమం,

షడ్రుచుల సమ్మేళంతో ఉగాది పర్వదినం చాటుతుంది ఈ సందేశం.

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

Happy-Ugadi

తిమిరాన్ని పారదోలే నూతన ఉషోదయం

కొత్త చిగుళ్లతో, కోకిల రాగాలతో సరికొత్త ఆరంభానికి లభించే సంకేతం

ఉగాది పర్వదినంతో ఆరంభించు నవశకం

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

Ugadi Wishes in Telugu

 ప్రకృతిని పులకరింపజేసేదే చైత్రం

జీవితంలో కొత్త ఉత్సాహం నింపుతూ పలకరించేదే ఉగాది పర్వదినం.

షడ్రుచుల సమ్మేళనంలా నిలవాలి మన బంధాలు పదిలంగా కలకాలం.

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు