Happy Valentine’s Day Wishes: ప్రేమలో ఓడిపోవడం, గెలవడం అంటూ ఉండవు. ఆ ప్రేమ పంచిన అనుభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో పదిలం, శాశ్వతం. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు, Valentine’s Day Telugu Greetings, Premikula Roju Messages, Valentine’s Day Telugu Love Quotes కోసం ఇక్కడ చూడండి

ఈ ప్రేమికుల రోజున మీరు ప్రేమించే లేదా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకు మీ ప్రేమ సందేశాన్ని పంపేందుకు వీలుగా ప్రేమతో రాసిన కొన్ని ప్రేమ వాక్యాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.....

Happy Valentine's Day (Photo Credits: File Image)

Happy Valentine’s Day Telugu Wishes: ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ ఒక వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయితితో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా , ఆ బంధం చిరకాలం నిలవాలన్నా ప్రేమే మార్గం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అయి ఉండవచ్చు, లేదా కుటుంబం, సమాజం మీద అయి ఉండవచ్చు. నిజమైన ప్రేమ పొందాలంటే అది ధనంతోనో, బలంతోనే దక్కించుకునేది కాదు. అలా పొందిన ప్రేమ అసలు ప్రేమే కాదు. నిజమైన ప్రేమ నిజంగా ప్రేమించడం ద్వారానే జయించగలం.

కొందరికి ప్రేమ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది, మరికొందరికి అదే ప్రేమ జీవితంలో పైకి ఎదిగేలా చేస్తుంది. ప్రేమలో ఓడిపోవడం, గెలవడం అంటూ ఉండవు. ఆ ప్రేమ పంచిన అనుభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో పదిలం, శాశ్వతం. ప్రేమ అనేది మనలో, ప్రతి జీవిలో ఉండే దైవత్వం.

ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ప్రేమ ఏ ఒక్కరి సంస్కృతి, ఏ ఒక్కరి సాంప్రదాయమో కాదు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం. అంతగొప్ప ప్రేమకు ఒక రోజంటూ ఉండాలని ఆ ప్రేమకు నీరాజనాలు పలుకుతూ జరుపుకునే ఒక తియ్యని వేడుకే (Festival of Love) ప్రేమికుల రోజు (Premikula Dinotsavam ) లేదా వేలంటైన్స్ డే!

ఈ ప్రేమికుల రోజున మీరు ప్రేమించే లేదా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకు మీ ప్రేమ సందేశాన్ని పంపేందుకు వీలుగా ప్రేమతో రాసిన కొన్ని ప్రేమ వాక్యాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఈ సందేశాలు మీ ప్రియమైన వారికి పంపడం ద్వారా వారిని మీరు మరొక్కసారి గుర్తుచేసుకున్నట్లుగా మీరు మాటల్లో చెప్పలేని ప్రేమను ఇంకో విధంగా వ్యక్తం చేసి, వారి ప్రేమను గెలవాలని, మీ బంధం చిరకాలం నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.  Happy Valentine’s Day Wishes in English

Happy Valentine's Day Wishes in Telugu (File Image)

Happy Valentine’s Day Wishes: నిన్ను చూసిన మొదటి రోజే, నీ కళ్లల్లోకి చూసిన మొదటి క్షణమే ఓ మాయగా నీ ప్రేమలో పడిపోయా. ఇక నువ్వే నా జీవితం అని నా గుండెల్లో మన ఇద్దరి ప్రయాణాన్ని లిఖించేశా!

Happy Valentine's Day Wishes in Telugu | (File Image)

Happy Valentine’s Day Wishes: ఎడారి లాంటి నా జీవితానికి నువ్వే ఓ ఒయాసిస్, తీరం తెలియని నా జీవిత నావకు నువ్వే ఓ లంగరు. నువ్వు లేని నా జీవితం, ఎలాంటి రాత లేని తెల్ల కాగితంతో సమానం.

Happy Valentine's Day Wishes in Telugu | (File Image)

Happy Valentine’s Day Wishes:  నేను ఎక్కడా ఉన్నా నువ్వు నా పక్కనే ఉన్నట్లుగా ఉంటుంది.

ఎంత దూరంలో ఉన్నా, నా మనసు నీకు దగ్గరలోనే ఉంటుంది.

ఏ పనిలో ఉన్నా, ధ్యాస నీపైనే ఉంటుంది.

నా ప్రతి ఆలోచనలో నువ్వు భాగస్వామ్యం

నా ప్రతి తలపులో నీ రూపం పదిలం.

Happy Valentine's Day Wishes in Telugu | (File Image)

Happy Valentine’s Day Wishes:   కలలో కూడా అనుకోలేదు నా అదృష్టం నీ రూపంలో వస్తుందని... నా జీవితంలోకి వచ్చినందుకు నీకు వేలవేల కృతజ్ఞతలు.

Happy Valentine's Day Wishes in Telugu | (File Image)

Happy Valentine’s Day Wishes:  నా బలం నువ్వే, నా బలహీనతా నువ్వే, నా సంతోషం నువ్వే, నా తియ్యని బాధ నువ్వే.కాలాలు మారినా, నీపై నా ప్రేమ కలకాలం ఉంటుంది.

ప్రేమికులందరికీ, ప్రేమించే వారందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now