Blue idli: బఠానీ పువ్వుల రసంతో నీలి రంగు ఇడ్లీలు చేసిన మహిళ.. బఠానీ పువ్వులను ఉడకబెట్టిన నీళ్లను ఇడ్లీ పిండిలో పోసిన వైనం.. దానితో చూడచక్కటి నీలి రంగు ఇడ్లీలు తయారు చేసిన మహిళ.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకు లక్షల్లో వ్యూస్

అది కూడా పువ్వుల రసంతో చేసి ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ అయిన జ్యోతి కల్బుర్గి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక ప్లేట్ లో ఆమె నీలం, తెలుపు రంగుల ఇడ్లీలను చూపించింది. నీలి రంగు ఇడ్లీలను చేయడానికి జ్యోతి బఠానీ పువ్వుల రసం ఉపయోగించడం విశేషం.

Blue idli (Credits: Instagram)

Newdelhi, October 24: ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర విషయాలెన్నో కనిపిస్తున్నాయి. ఆహార ప్రియులు కాసేపు నెట్ లో వెతికితే కొన్ని వేల రకాల వంటకాలు దర్శనం ఇస్తుంటాయి. కొంత మంది సంప్రదాయ వంటకాలను సింపుల్ గా ఎలా చేయాలో చెబితే మరికొందరు విచిత్రమైన ఆహార పదర్ధాలను చూపిస్తుంటారు. తాజాగా ఓ మహిళ నీలి రంగు ఇడ్లీలు చేసింది. అది కూడా పువ్వుల రసంతో చేసి ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్ అయిన జ్యోతి కల్బుర్గి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక ప్లేట్ లో ఆమె నీలం, తెలుపు రంగుల ఇడ్లీలను చూపించింది. నీలి రంగు ఇడ్లీలను చేయడానికి  జ్యోతి బఠానీ పువ్వుల రసం ఉపయోగించడం విశేషం.

మహిళను చెంప చెళ్లుమనేలా కొట్టి... ఆపై క్షమాపణలు చెప్పిన మంత్రి.. వివాదంలో కర్ణాటక మంత్రి సోమన్న.. హంగ్లా గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం.. అర్జీ ఇచ్చేందుకు ప్రయత్నించిన మహిళ.. సహనం కోల్పోయిన మంత్రి సోమన్న.. వీడియో వైరల్

జ్యోతి ముందుగా కొన్ని బఠానీ పువ్వులను నీటిలో ఉడకబెట్టింది. నీలి రంగులోకి మారిన ఆ నీటిని ఇడ్లీ పిండిలో చేర్చింది. ఇడ్లీ పాత్రలో సాధారణ ఇడ్లీ పిండిని, బఠానీ పువ్వుల నుంచి తీసిన నీళ్లు కలిపిన పిండిని వేర్వేరుగా ఉడకబెట్టింది. దాంతో, తెల్లటి ఇడ్లీలతో పాటు నీలి రంగు ఇడ్లీలు కూడా తయారయ్యాయి. అనంతరం రంగురంగుల ఇడ్లీలను ఓ పాత్రలో ఉంచిన జ్యోతి చట్నీ తో వడ్డించింది. ఈ వీడియోకు ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల వేలాది కామెంట్లతో ఈ వీడియో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు వెరైటీ ఇడ్లీలు చేశావంటూ జ్యోతిని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ఇదేం వంట అని విమర్శిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif