Desi Cow Milk Benefits: ఆవు పాల లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, గుండె జబ్బులు రాకుండా చేసే ఏకైక గుణం ఉన్న ఔషధం ఆవుపాలే, అమ్మ పాలతో సమానమైన ఆవు పాల
ఆవు పాలు చిన్న పిల్లలకు మంచిది తల్లిపాలతో సమానం మనిషిలో చలాకీతనం పెంచుతుంది, ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి, పేగులలో క్రిములు నశిస్తాయి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
పాల ఉత్పత్తి, పాల ఉత్పత్తుల విక్రయాలు అతి ముఖ్యమైన కార్యకలపాలుగా నిలుస్తున్నాయి. నేటి రద్దీ జీవనశైలి కారణంగా వారు ఆహార పోషకాల కోసం పాలు ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. చాలామంది ప్రజలు అతి తక్కువ కొవ్వుశాతం ఉండటంతో పాటు ఇతర పోషక విలువల కారణంగా ఆవుపాలపై ఆధారపడుతున్నారు. ఆవు పాలు చిన్న పిల్లలకు మంచిది తల్లిపాలతో సమానం మనిషిలో చలాకీతనం పెంచుతుంది, ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి, పేగులలో క్రిములు నశిస్తాయి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
చదువుకునే పిల్లలకు తెలివిని పెంచుతుంది. వారిని నిష్ణాతులు చేస్తాయి మనసును, బుద్ధిని చైతన్యం చేస్తాయి. సాత్విక గుణాన్ని పెంచుతుంది. తెల్ల ఆవుపాలు వాతాన్ని నల్ల ఆవు పాలు పితాని ఎరుపు రంగు ఆవు పాలు కఫాన్ని హరిస్తాయి. ఆవు పాలు సర్వరోగ నివారణ ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉంది. ఆవు నెయ్యి బుద్ధిబలాన్ని పెంచుతుంది ఆవు పాలు ఆయుష్షును పెంచుతుంది.
ఆవు పాలు పచ్చగా ఉంటాయి ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపుతత్వం ఉంది.అందుకనే సాధువులు, వృషులు, మునులు ఆవుపాలను సేవిస్తారు. యజ్ఞానికి, హోమానికి ఆవు పాలను వాడుతారు దేవాలయంలో పూజకు అభిషేకానికి ఆవుపాలను వాడుతారు. ఆవు పాలలో క్యాల్షియం, ఫాస్ఫరస్, మీ ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఇతర మినరల్స్ ని అధికంగా కలిగి ఉంటాయి. అందుచేతనే ప్రభుత్వం వారు ప్రపంచం మొత్తం పిల్లలు పెద్దలు ఇద్దరూ ఆవుపాలను ప్రతిరోజు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
మంచి నాణ్యత కలిగిన ఆవుపాలలో ఒమేగా త్రీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రక్తంలోని కొవ్వు శాతాన్ని నియంత్రించి ఎక్కువ కాలం మీ గుండె ఆరోగ్యంగా ఉండే టట్లు చేస్తుంది. విటమిన్ డి కేవలం మీ ఎముకలను బలంగా ఉంచడానికి మాత్రమే ముఖ్యం కాదు. ఇది సెరోటిన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. ఈ హార్మోన్ సరైన నిద్రకు మీ మనసు ప్రభావానికి మీ ఆకలి పెంచడానికి కూడా బాధ్యత వహించే హార్మోన్. ఆవు పాలు విటమిన్లతో నిండి ఉన్నప్పటికీ వీటిని ప్రతి రోజూ తాగడం ఆరోగ్యంగా ఉండటానికి మంచి మార్గం.