Benefits Of Oil Pulling: ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి ?, దీని వల్ల కలిగే లాభాలేంటి, పూర్తివివరాలు మీకోసం..
ఆయిల్ పుల్లింగ్ … రోజు ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపున ఒక చెంచా ఆయిల్ ని నోట్లో వేసుకుని కనీసం పది నిముషాల పాటు ఇరువైపులా బాగా పుక్కిలించి బయటకు ఉమ్మివేయండి.
ఇప్పుడున్న జీవన గమనంలో ప్రతిరోజు మనం కలుషిత గాలిని లోపలకి పీలుస్తున్నాం. అలానే ప్యాకేజ్డ్, ఫ్రైడ్, ఫాస్ట్, ప్రొసెస్డ్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇలాంటి ఫుడ్ ని మన శరీరం అరగించుకోటానికి ఇబ్బంది పడాల్సివస్తుంది. ఈ వ్యర్థాలు ప్రేగుల్లో అతుక్కుపోయి అలానే వదలకుండా చాలా కాలం ఉండిపోతాయి. అంతేకాకుండా ఇవి రక్తం ద్వారా ఇతర ఆర్గాన్స్ కు చేరితే కనుక పలు ఇబ్బందులు ఎదురవుతాయి. వాయునాళంలోకి వెళితే ఆస్తమా, ప్రేగుల్లో అతుక్కుంటే మలబద్దకం, చర్మ పొరలలోకి వెళితే పింపుల్స్ లాంటి ప్రాబ్లెమ్స్ వస్తాయి . అందుకే శరీరంలో ఉండిపోయిన మలినాలను క్లీన్ చేసుకోవటం తప్పనిసరి.
మరి మలినాలను ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయిల్ పుల్లింగ్ … రోజు ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపున ఒక చెంచా ఆయిల్ ని నోట్లో వేసుకుని కనీసం పది నిముషాల పాటు ఇరువైపులా బాగా పుక్కిలించి బయటకు ఉమ్మివేయండి. కొబ్బరినూనె, ఆవనూనె, నువ్వలనూనె లాంటి ఏదైనా గానుగ పట్టిన నూనెను ఉపయోంచుకోవచ్చు. మన నాలుక శరీరంలోని చాలా ఆర్గాన్స్ తో అనుసంధానించబడి ఉండటంతో నోటిలోని వ్యర్ధాలు మాత్రమే కాకుండా శరీరం లోపలి వ్యర్ధాలు కూడా బయటకి వచ్చేస్తాయి. ఆయిల్ పుల్లింగ్ చేయటం మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొన్ని రోజులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఇలా చేయటం వల్ల వ్యర్ధాలు తొలిగిపోవటమే కాకుండా అనేక ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో తెల్లని పల్లు (టీత్స్), తాజా శ్వాస, గులాబీ రంగు పెదవులు మరియు చిగుళ్లు సొంతమవుతాయి. అంతేకాకుండా ఎక్కువసేపు పుక్కిలించటంతో ముఖ కండరాల వ్యాయామం జరిగి మచ్చలు లేని కాంతివంతమైన పేస్ లభించటమేకాకుండా గ్యాస్, అసిడిటీ లాంటి ప్రాబ్లెమ్స్ కూడా నయమవుతాయి. ఇదొక వెయిట్ లాస్ వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. దీంతో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయని అనేక అధ్యనాల జరిపిన తర్వాత నిపుణులు వెల్లడించారు. ఆయిల్ పుల్లింగ్ చేయండి… ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.