Health Tips: బెల్లి ఫ్యాట్.. సింపుల్‌గా ఇంట్లోనే ఉండి ఇలా తగ్గించుకోండి
ఈ సమస్య నుండి బయట పడేందుకు చాలా ఫీట్స్ చేస్తున్నారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోతోంది. ఫలితంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని నియమాలు తప్పనియారిగా పాటించాల్సిందే.
Hyd, Aug 9: బెల్లి ఫ్యాట్..చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య నుండి బయట పడేందుకు చాలా ఫీట్స్ చేస్తున్నారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉండిపోతోంది. ఫలితంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని నియమాలు తప్పనియారిగా పాటించాల్సిందే.
ప్రధానంగా చక్కెర స్థాయి తగ్గించుకోవాలి. ఎందుకంటే చాలా మంది తీపి పదార్థాలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇదే ప్రధానంగా బెల్లి ఫ్యాట్ పెరగడానికి కారణమవుతుంది. తీపి పదార్థాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచి బెల్లి ఫ్యాట్ కు కారణం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.
అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా బెల్లి ఫ్యాట్ పెరగడానికి దోహద పడుతుంది. కాబట్టి బెల్లి ఫ్యాట్ తగ్గించాలి అనుకునే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. బెల్లి ఫ్యాట్ కారణంగా గుండెపోటు, బ్లడ్ ప్రెజర్, షుగర్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది.
పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకునేందుకు ఉత్తమ పద్దతి వ్యాయామం. పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు రోజుకు కనీసం 3,500 కెలోరీలను కరిగించాల్సి ఉంటుంది. యోగా చేయడం ద్వారా పొట్ట కొవ్వును సులభంగా ఇంట్లోనే కరిగించుకోవచ్చు. తద్వారా మీరు చురుకుగా మారే అవకాశం కూడా ఉంటుంది. యోగాసనాలు వేయడం ద్వారా మీ హృదయంపైన కూడా భారం పడదు తద్వారా మీరు సులభంగానే బరువును తగ్గించుకోవచ్చు. సహజసిద్ధంగా చెడు కొలెస్ట్రాల్‌ను ఇలా తగ్గించుకోండి, ఇవి ట్రై చేయండి, హార్ట్ ఎటాక్ నుండి బయటపడవచ్చు
ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి, ఆహార పదార్థాలను తీసుకుంటే పొట్ట కొవ్వు కరిగిపోతుంది. రక్తంలో కరిగిపోయే ఫైబర్ కొవ్వు కణాలను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా మీరు కార్బోహైడ్రేట్లను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది తద్వారా మీరు శరీరంలో కొవ్వు నిలబడకుండా కాపాడుకోవచ్చు.