Bitter Gourd Benefits: కాకరకాయ తీసుకోవడం వల్ల కలిగే లాాభాలు, ఆస్తమాకు ఆయుర్వేద ఔషధం కాకర, ఇమ్యూనిటీని పెంచే రామబాణం కాకర...

ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గడంలో కాకర ఎంతో ఉపయోగపడుతుంది.

Bitter Gourd (కాకర కాయ) Image used for representational purpose. | (Photo Credits: Pixabay)

Bitter Gourd (కాకర కాయ)  కూర తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. చేదుగా ఉండే కాకరను ఎలా తింటాం అని దూరం పెడుతుంటారు. కానీ కాకర కాయలో బోలెడు పోషకాలున్నాయి. ఫ్రై చేసినా, ఉడికించినా.. జ్యూస్ రూపంలో తీసుకున్నా.. కాకరలోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.

>> ముఖ్యంగా వర్షాకాలంలోనైతే కాకరను తరచుగా తీసుకోవడం మరింత ఫలితాన్నిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

>> వర్షాకాలంలో కాకరను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను దూరం చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారి, ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.

>> కాకర కాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చూస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసి బరువు తగ్గుతారు. కాకర కాయలో క్యాలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.

>> డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కాకర ఓ వరం. కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులోని చార్న్‌టిన్ పెప్‌టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.

>> కాకరలోని యాంట్రీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడతాయి.

>> కాకరను తరచుగా తినడం వల్ల చర్మ, రక్త సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గడంలో కాకర ఎంతో ఉపయోగపడుతుంది.