Fresh Covid Guidelines: కోవిడ్ కొత్త గైడ్‌లైన్స్, లక్షణాలు ఉంటే 10 రోజుల ఐసొలేషన్‌లో ఉండాల్సిందే, లక్షణాలు లేని వారు ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(Coronavirus) వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే వార్తల నేపథ్యంలో కొన్ని దేశాలు.. సంబంధిత ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నాయి, అయినప్పటికీ కరోనా మహమ్మారి భయాందోళనలు నెలకొనే ఉన్నాయి.

COVID-19 in India (Photo Credits: PTI)

Geneva, Jan 16: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(Coronavirus) వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే వార్తల నేపథ్యంలో కొన్ని దేశాలు.. సంబంధిత ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నాయి, అయినప్పటికీ కరోనా మహమ్మారి భయాందోళనలు నెలకొనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కొన్ని కీలక సూచనలు (Fresh Covid Guidelines) చేసింది.

కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తులకు సంబంధించి నూతన మార్గదర్శకాలను(COVID-19 Guidelines) విడుదల చేసింది. దీంతోపాటు జనసమూహాల్లో మాస్కు(Mask) ధరించడం, కొవిడ్‌ చికిత్స, వైద్య నిర్వహణ విషయంలో సిఫార్సులను అప్‌డేట్‌ చేసినట్లు తెలిపింది. కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో.. మాస్కు ధరించడంతోపాటు బూస్టరు డోసు వేసుకోవాలని సూచించింది.

వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుకు విశాఖలో అపూర్వ స్వాగతం.. జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో వెల్ కమ్

కరోనా సోకినవారు లక్షణాలు కనిపిస్తే 10 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సూచించింది.కరోనా బారిన పడ్డ వ్యక్తికి ఒకవేళ యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తే ఐసొలేషన్‌ నుంచి ముందుగానే బయటకు రావచ్చు. కొవిడ్‌ నిర్ధారణ అయి.. లక్షణాలు లేని వారు మాత్రం ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి. గతంలో వీరికి ఐసోలేషన్‌ వ్యవధి పది రోజులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో.. స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా మాస్కులను విధిగా ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది. చికిత్స విషయంలో నిర్మాట్రెల్విర్- రిటోనావిర్ వినియోగాన్ని కొనసాగించాలని సూచించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement