Vande Bharat: వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుకు విశాఖలో అపూర్వ స్వాగతం.. జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో వెల్ కమ్

Visakhapatnam, Jan 16: సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్ (Railway Station) నుంచి నిన్న ఉదయం బయలుదేరిన వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ ప్రెస్ రైలుకు విశాఖపట్టణంలో (Visakhapatnam) ఘటన స్వాగతం (Welcome) లభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించారు. రాత్రి 10.45 గంటలకు విశాఖ చేరుకున్న రైలుకు రైల్వే అధికారులు జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు రైలుపై పూల వర్షం కురిపించారు. అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అనకాపల్లి నుంచి విశాఖపట్టణం వరకు ఈ రైలులో ప్రయాణించారు.

ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత

ఇక, సికింద్రాబాద్‌లో జరిగిన రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందేభారత్ రైలులో మొత్తం 16 భోగీలు ఉన్నాయి. ఇందులో 14 చైర్ కార్లు కాగా, రెండు ఎగ్జిక్యూటివ్ బోగీలు. 1128 మంది ఒకేసారి ఈ రైలులో ప్రయాణించవచ్చు.

పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న ఆహార సంక్షోభం.. గోధమపిండి ట్రక్‌ వెనక బైక్‌లతో పౌరుల ఛేజింగ్.. వైరల్ వీడియో