Credits: Twitter

Chennai, Jan 16: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ (85) (Balamurugan) కన్నుమూశారు. తెలుగు (Telugu), తమిళం (Tamil) సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా (Writer) పనిచేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.

నాలుగో ఫ్లోర్ నుంచి కిందపడిన లిఫ్ట్.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నఎన్సీపీ నేత అజిత్ పవార్

బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి హిట్ సినిమాలకు కథ అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన ‘బంట్రోతు భార్య’ సినిమాకు కూడా ఆయనే కథ అందించారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40 కథల వరకు అందించారు. బాలమురుగన్ మృతి వార్త తెలిసిన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పాకిస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న ఆహార సంక్షోభం.. గోధమపిండి ట్రక్‌ వెనక బైక్‌లతో పౌరుల ఛేజింగ్.. వైరల్ వీడియో