Eggs and Diabetes: షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం
ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని తమ ఆహారపు మెనూని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు (Eggs and Diabetes) విషయంలో కూడా షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉంటాయి.
షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని తమ ఆహారపు మెనూని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు (Eggs and Diabetes) విషయంలో కూడా షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది డయాబెటిక్ రోగులు (eat eggs if you have diabetes) భయపడుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
గుడ్లు తినని వారికంటే గుడ్లు తినే వారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉన్నదని ఆ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనకారులు తెలిపారు. ‘సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన ఆ అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిక్, టైప్-2 డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.
మధుమేహం ఉన్నవాళ్లు ఎగ్స్ ను నిరభ్యంతరంగా తినొచ్చని పరిశోధనలో తేలింది. గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిదే. ఒంట్లో శక్తి లేని వాళ్లు, నీరసంగా ఉన్నవాళ్లు, పోషకాలు తక్కువ ఉన్నవాళ్లు షుగర్ ఉన్నా సరే.. నిత్యం ఉడకబెట్టిన గుడ్డును తింటే.. చాలామంచిది అని నిపుణులే సూచిస్తున్నారు. గుడ్డులో ఉండే ప్రొటీన్స్, సూక్ష్మ పోషకాలు.. మధుమేహం పేషెంట్లకు ఎంతో ఉపయోగపడతాయట.
గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో.. మితంగా ఆహారం తీసుకుంటాం కాబట్టి.. బరువు త్వరగా తగ్గుతారు. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అడ్డుకునే శక్తి గుడ్డుకి ఉందని తాజా రీసెర్చ్‌లు చెబుతున్నాయి. అదేవిధంగా గుడ్డులో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల గర్బిణీలు, బాలింతలు గుడ్లని రెగ్యులర్‌గా తీసుకోవాలి.