Dental Procedures: డెంటల్ క్లినిక్స్‌పై కరోనా ప్రభావం, అత్యవసరమైతే తప్ప సాధారణ దంత చికిత్సలకు అనుమతి లేదు, లాక్‌డౌన్ 4లో దంత వైద్యానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ తదుపరి మార్గదర్శకాలు జారీ చేసేవరకు అన్ని రకాల దంత చికిత్సలను వాయిదా వేయాలని....

Dental clinics during lockdown 4 | (Photo Credits: Pixabay)

New Delhi, May 20:   లాక్‌డౌన్ 4లో ప్రభుత్వం చాలా రంగాలకు అనేకమైన సడలింపులు కల్పించినప్పటికీ, దంత వైద్యానికి సంబంధించి మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దంత సమస్యలకు సంబంధించి ఏ జోన్లలోనైనా అత్యవసరమైతే తప్ప సాధారణ చికిత్సలు నిలిపివేయబడే ఉంటాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్‌డౌన్ 4లో జోన్ల వారీగా దంత వైద్యానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.

కరోనావైరస్ వ్యాప్తి ప్రధానంగా నోరు, ముక్కు, కళ్లతో ముడిపడి ఉంటుంది కాబట్టి దంత పరీక్షలు నిర్వహించడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ తదుపరి మార్గదర్శకాలు జారీ చేసేవరకు అన్ని రకాల దంత చికిత్సలను వాయిదా వేయాలని డెంటల్ క్లినిక్స్ యాజమాన్యాలకు స్పష్టం చేసింది.

కంటెన్మెంట్ జోన్లలో డెంటల్ క్లినిక్స్ పూర్తిగా మూసివేయబడే ఉంటాయని, అయితే అత్యవసరమైతే అంబులెన్స్ సేవలను వినియోగించుకొని నిర్ధేషించబడిన ప్రత్యేక కోవిడ్ దంత వైద్య విభాగాన్ని సంప్రదించవచ్చునని తెలిపింది. రెడ్ జోన్లలో అత్యవసర దంత చికిత్సలను నిర్వహించుకోడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లలో కన్సల్టన్సీకి అనుమతి ఉంటుంది. రోగి దంత వైద్య నిపుణుడిని సంప్రదించి తన సమస్యకు సంబంధించి పరిష్కారం పొందవచ్చు, అయితే ఎలాంటి పరీక్షలకు గానీ, చికిత్సలకు గానీ అనుమతి ఉండదు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక జాగ్రత్తల ద్వారా చికిత్సకు అనుమతి ఉంటుంది.

 

Ministry of Health & Welfare Issues Guidelines For Dental Clinics:

 

దేశవ్యాప్తంగా ఏ జోన్ పరిధిలోనైనా, ప్రభుత్వ దంత వైద్య విభాగం లేదా ప్రైవేట్ డెంటల్ క్లినిక్ అయినా, గ్రామీణ స్థాయి దంత వైద్య నిపుణిడికి సైతం అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. డెంటల్ క్లినిక్స్ లో సాధారణ పరీక్షలు నిలిపివేయాలి, కేవలం అత్యవసర దంత చికిత్సలు మాత్రమే నిర్వహించాలి. అది కూడా రోగులకు ఎలాంటి దంత చికిత్సనైనా ప్రాంభించే ముందు వారికి వైరస్ నిర్ధారిత ILI మరియు SARI లకు పరీక్షలు చేయాలి. నెగెటివ్ అని తేలితేనే ముందుకు సాగాలి. పాజిటివ్ అని వస్తే, వెంటనే వైద్య శాఖ అధికారులకు తెలియజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

డెంటల్ క్లినిక్స్ పూర్తిగా హైజీన్ (పరిశుభ్రమైన) విధానాలను అనుసరించాలి. క్లినిక్ లోపలికి ప్రవేశం, రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, ఇతర గదుల్లో నిరంతరం శానిటైజ్ చేయాలి. స్టెరిలైజేషన్ కోసం ప్రత్యేకమైన ప్రాంతం, వాష్‌రూమ్‌లు, పరికరాలు మరియు సిబ్బందికి సరైన శిక్షణ, ఎన్ -95 మాస్క్‌లు ఖచ్చితంగా ధరించాలి. క్లినిక్ సహా వైద్యానికి ఉపయోగించే అన్ని పరికరాలు ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేస్తూ ఉండాలని డెంటల్ క్లినిక్స్ కు మరియు దంత వైద్యులకు ఖచ్చితమైన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif