Nasal Hair: ముక్కులో వెంట్రుకలు తీసేయకండి, అరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు, శ్వాస వ్యవస్థ ఆరోగ్యం కోసం ముక్కు వెంట్రుకలు అవసరమంటున్న నిపుణులు
ఇందులో భాగంగానే ఎక్కువ శాతం మంది ముక్కులో ఉండే వెంట్రుకల (Nose Hair) ను కూడా కత్తిరిస్తూ ఉంటారు. అయితే ఇలా ముక్కులో వెంట్రుకలు తీసేయడం (Should not pluck Nasal Hair) కంటే వాటిని ఉంచుకుంటే చాలా మేలని వైద్యులు (Doctors) చెబుతున్నారు.
మనలో చాలామంది అందంగా కనిపించేందుకు మన శరీర భాగాలలో ఉన్న అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ శాతం మంది ముక్కులో ఉండే వెంట్రుకల (Nose Hair) ను కూడా కత్తిరిస్తూ ఉంటారు. అయితే ఇలా ముక్కులో వెంట్రుకలు తీసేయడం (Should not pluck Nasal Hair) కంటే వాటిని ఉంచుకుంటే చాలా మేలని వైద్యులు (Doctors) చెబుతున్నారు. ముక్కులో ఏర్పడే వెంట్రుకలను (Nose Hair) తీసివేయడం ద్వారా ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల వాతావరణంలో ఏర్పడే దుమ్ము, ధూళి కణాలను, సూక్ష్మజీవులను ముక్కు ద్వారా శ్వాసనాళంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని వైద్యులు అంటున్నారు. తద్వారా ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా ఈ వెంట్రుకలు (Hairs) ఆపుతాయని వైద్యులు చెబుతున్నారు. ముక్కులో వెంట్రుకలను పీకినప్పుడు వాటి కుదుళ్ళలో ఏర్పడే రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ జరిగి రక్త నాళాల్లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా రక్తం సరఫరా జరిగే సిరులలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. దీనినే ‘కావర్నస్ సైనస్ థ్రోంబోసిస్’ అని పిలుస్తారు. ఇది మెదడుపై అధిక ఒత్తిడిని తీసుకు రావడం వల్ల కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముక్కు వెంట్రుకలు మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఈ వెంట్రుకలు గాలిలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే వ్యాధికారక క్రిముల నుండి రక్షణ కల్పిస్తాయి. అలాగే శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు అవసరమని వైద్య శాస్త్రం చెప్తున్నది. కాగా డాక్టర్ల బృందం ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో 1896 సంవత్సరంలో ఒక వ్యాసాన్ని ప్రచురించారు. దీని ప్రకారం, కాలుష్యం దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వల్ల ముక్కులో కొన్నిసార్లు మొటిమలు లాంటివి కూడా వస్తాయని తెలిపారు. ఈ సమయంలో ముక్కు వెంట్రుకలు తేమతో ఒక ఉచ్చును ఏర్పర్చి ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియాను ఊపిరితిత్తులలోకి రాకుండా చేస్తాయని తెలిపారు.
ఇలాంటి సమయంలో ముక్కులోని వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా వ్యాక్స్ చేసినప్పుడు వైరస్, బ్యాక్టీరియా కోసం ఒక క్లీన్ ట్రాక్ సృష్టించబడి అవి ఊపిరితిత్తులకు సులభంగా చేరుతాయి. అయితే, ముక్కు వెంట్రుకలపై ఇప్పటివరకు పరిమితంగానే అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో ముక్కులోని వెంట్రుకలను కత్తిరించడం లేదా వాక్సింగ్ చేయడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని నిపుణులు చెబుతున్నారు.