Health Tips: మాత్రలు మింగే వారు వీటితో కలిపి వేసుకోవద్దు,అలా మింగితే మాత్రలు పనిచేయకపోయే ప్రమాదం ఉందంటున్న డాక్టర్లు
ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. కొందరు నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం (Taking Medicine ) చేస్తుంటారు
సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. కొందరు నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం (Taking Medicine ) చేస్తుంటారు.అయితే ఇలా చేయడం వల్ల ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు.
అలాగే పాల ఉత్పత్తులు శరీరంలో విభిన్నమైన ప్రక్రియలకు కారణమవుతాయి. యాంటీబయాటిక్స్ తీసుకుంటూ వాటితో పాటు పాలు తాగుతూ ఉంటే పాలలోని కాల్షియం, మెగ్నీషియం ఔషధం యొక్క ప్రభావాన్ని పరిమితం చేస్తాయి. కనుక యాంటీబయాటిక్ మందులను పాలతో పాటు తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు.ఇక కొందరు నిద్రపట్టేందుకు మాత్రలు వేసుకుంటుంటారు. అలాంటివారు ఆ స్లీప్ మెడిసిన్‌తో డార్క్ చాక్లెట్ తినకూడదు. ఈ చాక్లెట్ నిద్రపోయే ఔషధాన్ని పూర్తిగా పనిచేయకుండా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.