Health Tips: రక్తపోటు అనేది రోగం కాదు, భయపడనవసరం లేదు, రక్తపు పోటు ఎందుకు వస్తుంది, దానికి చికిత్స ఏమిటీ, లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి చూద్దాం

High blood pressure (Photo credits: Needpix)

రక్తపు పోటు లేదా రక్తపోటు (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు జీవ లక్షణములను (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు జీవ లక్షణములను అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని 'అధిక రక్తపోటు' (high blood pressure or hypertension) అంటారు. ఇలా రక్తపు పోటు మితి మీరితే అది రోగ లక్షణం.

రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఏమీ లక్షణాలు కనబడవు. చాప కింద నీరులా ఇది శరీరానికి కొంత హాని చేసిన తరువాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని ప్రస్పుటమవుతుంది. ఇలా ముదిరిన తరువాత మందులు వాడినా జరిగిపోయిన హానిని తిరగబెట్టలేము. అందుకని తరచు రక్తపు పోటు ఎంత ఉందో, అవకాశం దొరికినప్పుడల్లా - కొలుచుకుని చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ రక్తపు పోటు ఉంటే అది గుండె జబ్బుకీ, మూత్రపిండాల జబ్బుకీ దారితీసే ప్రమాదం ఉంది. దీనికి విపర్యంగా మూత్రపిండాలకి జబ్బు చేస్తే దాని మూలంగా రక్తపు పోటు పెరుగుతుంది కూడ. అందుకని రక్తపు పోటు విలువ మీద ఒక కన్నేసి ఉంచటం చాల మంచి అలవాటు, ప్రాణాన్ని రక్షించుకునే అలవాటు.

డయాబెటిస్ వచ్చే ముందు శరీరంలో కలిగే మార్బులు ఇవే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రమ్మన్నా రాదు..

శరీరంలో ప్రసరించే రక్తం, రక్తనాళాలపై కలిగించే ఒత్తిడిని రక్త పీడనం లేదా రక్తపోటు అంటారు. శరీరము యొక్క ప్రధాన జీవ లక్షణాలలో రక్తపోటు ఒకటి. ధమనులు, ధమనికలు, రక్తనాళాలు, శిరల ద్వారా రక్తం ప్రవహించే క్రమంలో దాని పీడనం తగ్గుతూ వస్తుంది. సాధారణంగా రక్తపీడనం అని వ్యవహరించేటప్పుడు ధమనీ పీడనాన్ని (గుండెనుండి రక్తాన్ని ఇతర అవయవాలకు చేరవేసే పెద్ద ధమనులలోని పీడనం) పరిగణిస్తారు. ధమనీ పీడనాన్ని సాధారణంగా స్ఫిగ్మోమానోమీటర్ అనే యంత్రంతో కొలుస్తారు. ఇది పాదరసం యొక్క నిలువుటెత్తుతో ప్రసరించే రక్తం యొక్క ఒత్తిడిని సూచిస్తుంది.

రక్తపు పోటుకి కారణాలు

'ఎవ్వరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది?' అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. ప్రవర (family history), లింగం (gender), వయస్సు (age), జాతి (race) - అన్నీ కొద్దో గొప్పో దోహదం చేస్తాయి. తల్లి దండ్రులకి, దగ్గర బంధువులకి ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతూన్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం అమెరికాలో ఉండే నల్ల వారిలో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కారణాల వల్ల వచ్చే రక్తపు పోటు పెరుగుదలని ఇంగ్లీషులో primary hypertension అంటారు. వీటిని మనం అంతర్జనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇలా కాకుండా ఏదో జబ్బు వల్ల వచ్చేది secondary hypertension లేదా తెలుగులో వ్యాధిజనిత కారణాల వచ్చే పెరుగుదల అనవచ్చు. ఇటువంటి వర్గీకరణ కంటే భౌతిక సూత్రాలని ఉపయోగించి ఏయే సందర్భాలు రక్తపు పోటు పెరుగుదలకి దోహదం చేస్తాయో చూడవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండు తినకూడదు, వెంటనే తెలుసుకోండి, లేకపోతే మీరు ప్రమాదంలో పడే అవకాశం..

రక్తపు పోటుని అదుపులో పెట్టటం ఎలా?

మన అలవాట్లని మార్చుకుని చాల వరకు రక్తపు పోటుని అదుపులో పెట్టవచ్చు. ఇటువంటి సలహాలని ఆచరణలో పెట్టే ముందు వైద్యుణ్ణి సంప్రదించటం అన్నిటి కంటే ముఖ్యం.

పొగ తాగటం మానటం.

బరువుని అదుపులో పెట్టటం. ప్రతి వ్యక్తి విగ్రహానికి అనుకూలమైన బరువు ఉండాలి తప్పితే అతిగా ఉండకూడదు. లావుపాటి శరీరంతో పోలిస్తే బక్కపలచని శరీరం ఎప్పుడూ శ్రేయస్కరమే.

ఆరోగ్యమైన ఆహారం తినటం. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, పెరుగు, మొదలయిన పదార్ధాలు ఉండటం మంచిది. నూనెలు, నేతులు వాడేటప్పుడు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (unsaturated fatty acids) సంతృప్త కొవ్వు ఆమ్లాలు (saturated fatty acids) కంటే మంచివని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని రకాల చేప నూనెలు (fish oils) ఈ సందర్భంలో మంచివని గమనించాలి. ఉదాహరణకి : eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA).

ప్రతి రోజూ నియమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం. ప్రతిరోజూ అరగంటకి తక్కువ కాకుండా, కొద్దిగా చెమట పట్టే వరకు, గబగబ నడవటం.

ఆహారంలో ఉప్పు తగ్గించి తద్వారా సోడియం తగ్గించటం. ఉప్పు లేక పోతే తిండి రుచించదు. కాని సాధ్యమయినంత వరకు ఉప్పుని మితిగా వాడటం చిన్నప్పటినుండి అలవాటు చేసుకొనటం మంచిది.

మనస్సుకి ఆరాటం, ఉద్విగ్నత (anxiety, stress) తగ్గించటం. యోగ మంత్రం జపం చెయ్యటం వల్ల రక్తపు పోటు అదుపులోకి వస్తుందనటానికి ఆధారాలు ఉన్నాయి.

మాదక ద్రవ్యాలని సేవించేటప్పుడు మితి మీరకుండా ఉండటం. ఆల్కహాలు, సారా వంటి మాదక ద్రవ్యాలు మోతాదులో పుచ్చుకుంటే పరవాలేదు కాని, మితి మీరితే ప్రమాదం. ఆడవారి యెడల విచక్షణ చూపటం కాదు కానీ, మగ వారు బరించగలిగే మోతాదులో సగమే స్త్రీలు భరించగలరు. గర్బిణి స్త్రీలు - ఆరోగ్యంగా ఉన్నా సరే - మాదక ద్ర్వ్యాలు మూట్టకూడదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now