Heart Health Tips: గుండె సమస్యలు ఉన్నవారు ఏ వైపు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.. గుండె నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రాత్రిపూట మంచి నిద్ర అందరికీ అవసరం. ఇది శరీరానికి శక్తిని పునఃప్రాప్తి చేయడమే కాకుండా, అలసటను తగ్గించి మనస్సుకు పదును పెడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
రాత్రిపూట మంచి నిద్ర అందరికీ అవసరం. ఇది శరీరానికి శక్తిని పునఃప్రాప్తి చేయడమే కాకుండా, అలసటను తగ్గించి మనస్సుకు పదును పెడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే నిద్రలేమి లేదా నాణ్యత లేని నిద్ర గుండె సమస్యలకు ప్రధాన కారణంగా మారుతున్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
2018లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ సమయం నిద్రపోవడం, తరచుగా నిద్రలేమికి అంతరాయం కలగడం వల్ల గుండె జబ్బులు, గుండె జబ్బులకు సంబంధించిన మరణాల ప్రమాదం పెరుగుతుందని తేలింది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల శరీరంలో మంట, జీవక్రియ లోపాలు, నాడీ వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు ఉన్నవారికి ఏ వైపు నిద్రపోవడం మంచిది? నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.
వీపు మీద పడుకోవడం మంచిది కాదు:
గుండె సమస్యల ఉన్నవారు వీపు (బెల్లీ) మీద పడుకోవడం మంచిది కాదు. ఇది వాయుమార్గాన్ని ఒత్తిడికి గురి చేసి పొజిషనల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (Positional Obstructive Sleep Apnea) ను పెంచుతుంది. ఇది ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి, గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 2025లో జరిగిన తాజా అధ్యయనం కూడా ఇది స్పష్టం చేసింది.
ఎడమ వైపు పడుకోవడం:
ఎడమ వైపున పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. ఎడమ వైపు పడినప్పుడు గుండె స్థితిపై కొంత మార్పు కలిగే అవకాశం ఉంది.ఇది ECG రీడింగ్స్‌ను ప్రభావితం చేయవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది కొన్నిసార్లు సమస్యను తీవ్రతరం చేస్తుంది.
కుడి వైపున పడుకోవడం
ఆధునిక పరిశోధనలు.. అలాగే Healthline వంటి ఆరోగ్య సంస్థల ప్రకారం కుడి వైపుకు పడుకోవడం గుండె జబ్బులు ఉన్నవారికి అత్యంత సురక్షితమైనది. దీని వల్ల గుండెపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది.అలాగే ECG స్థిరంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి.
ICD (Implantable Cardioverter Defibrillator) ఉన్నవారు.. ICD అమర్చిన వ్యక్తులు ఎడమ వైపున పడితే అసౌకర్యాన్ని అనుభవించవచ్చు, ఎందుకంటే ఎక్కువ ICDలు ఎడమ వైపున అమర్చబడ్డాయి. అందువల్ల, ఇలాంటి వ్యక్తులు కుడి వైపున పడుకోవటం మంచిది.
పొట్ట మీద పడుకోవడం (Prone Position)
ఇది గుండె సమస్యలకు నేరుగా దారితీసే కారణం కాదు కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వెన్నెముకపై ఒత్తిడిని పెంచుతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత మరింత దిగజారిపోతుంది. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యంపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఏదేమైనా గుండె సమస్యలు ఉన్నవారు తమ వ్యక్తిగత వైద్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, డాక్టర్ సలహా తీసుకోవడం అత్యంత ముఖ్యమైనది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)