Clear Skin for Men: మగవారు ఫెయిర్ అండ్ హాండ్సమ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ టిప్స్ పాటించి చూడండి !

కాబట్టి మగవారూ మీరు ప్రత్యేకంగా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ముఖం తళతళ మెరవడమే కాకుండా మొఖంలో కొత్త నిగారింపు వస్తుంది...

Representational image | Photo Credits: File image

ఎప్పుడూ ఆడవారికేనా? మగవాళ్లకూ అందంగా కనిపించాలని ఉండదా? ఇప్పుడు మగవారికి కూడా మార్కెట్లో ఎన్నో రకాల సౌందర్య సాధనాలు (Beauty Products) అందుబాటులో ఉన్నాయి, మగవారికి కోసం కూడా బ్యూటీ సెలూన్లు వెలిశాయి. ఇప్పుడు ఆడవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మగవారు కూడా వారి అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా ముస్తాబు అవుతున్నారు. చాలా మంది మగవారు వారి ఇంట్లో వాళ్ల సిస్టర్స్ లేదా వారి లైఫ్ పార్ట్‌నర్స్ ఏవైతే ఫేస్ ప్యాకులు, బ్యూటీ క్రీములు వాడుతున్నారో వారితో పాటే వీరు వాటినే వాడేస్తున్నారు.

అయితే మగవారి చర్మానికి, ఆడవారి చర్మానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మగవారూ మీరు ప్రత్యేకంగా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ముఖం తళతళ మెరవడమే కాకుండా మొఖంలో కొత్త నిగారింపు వస్తుంది. అందుకు ఏం చేయాలంటే..

 

రోజులో అప్పుడప్పుడు ఫేస్‌వాష్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి

బెంజాల్ పెరాక్సైడ్ (benzoyl peroxide), సాలిసిలిక్ ఆసిడ్ (Salicylic Acid) గుణాలు కలిగిన ఉన్న ఫేస్ వాష్ ను ఎంచుకోవాలి. దీనితో రోజులో 1 లేదా రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది చర్మంలోని మృతకణాలను, అలసత్వాన్ని పోగొడుతుంది. మిమ్మల్ని మరింత ఫ్రెష్ గా కనిపించేలా చేస్తుంది. అయితే అదే పనిగా మొఖం కడుక్కోవటం కూడా మంచిది కాదు.

చర్మంలో తేమ నిలిపిఉంచడం

మన శరీరానికి హైడ్రేషన్ ఎంత అవసరమో చర్మానికి కూడా హైడ్రేషన్ కావాలి. మీది ఎలాంటి చర్మమో తెలుసుకొని (ఆయిల్ స్కిన్ లేదా డ్రై స్కిన్) తెలుసుకొని దానికి సరిపోయే మాయిశ్చరైజర్ ను వాడాలి. ఇది చర్మంలో తేమను అలాగే ఉంచి, దుమ్ము- ధూలి, యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కార్బోనేటెడ్ బెవరేజెస్ కాకుండా సహజ సిద్ధంగా లభించే పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.

చక్కెర తగ్గించడం

శరీరంలో చక్కెర లెవెల్స్ పెరిగితే అది ఎంత అనర్థమో తెలుసు, ఇది చర్మానికి కూడా అంతే హాని చేస్తుంది. చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మొఖంపై మొటిమలు వచ్చే ఆస్కారం ఉంది.

నిద్రపోయే ముందు ముఖాన్ని కడుక్కోవడం

చాలా మంది మగవారు ఇంటికి అలిసిపోయి వచ్చి అలాగే నిద్రపోతారు. దీని వల్ల మీ ముఖంపై చేరిన దుమ్ము, మలినాలు చర్మం పాడయ్యేలా చేస్తాయి. కాబట్టి పడుకునే ముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, మగవారి కోసం ప్రత్యేకంగా మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి. వాటిని ముఖానికి పట్టించుకోవాలి. ఇది చర్మంలో వెంటనే ఇంకిపోయి ముఖం పొడిబారకుండా తేమగా ఉంచుతాయి.

సరైన నిద్ర తీసుకోవడం

అర్థరాత్రుల వరకు మెలకువ ఉండటం మంచిది కాదు. ఇది కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ను పెంచుతాయి, అంతేకాకుండా చర్మంలో కార్టిసోల్స్ లెవెల్స్ ను పెంచుతాయి. ఇది ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తుంది. కాబట్టి నిద్రించే సమయంలో ఒత్తిడికి గురిచేసే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కనీసం 8 గంటలు మంచి నిద్రతీసుకోవాలి.

డెర్మటాలజిస్ట్

ఎవరైనా డెర్మటాలజిస్టును సంప్రదించి మీ ముఖానికి సంబంధించి ఏదైనా ట్రీట్ మెంట్ అందుబాటులో ఉందేమో తెలుసుకోవాలి. ఆయన సూచించిన విధంగా కొన్ని రకాల ప్రొడక్ట్స్, డైట్ ఫాలో అయితే మీరూ అందరినీ ఆకర్శించవచ్చు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif