Remedies for Sore Throat: చలికాలంలో గొంతు నొప్పిని మాయం చేసే అద్భుత చిట్కాలు, మీ ఇంట్లో ఓ సారి ప్రయత్నించి చూడండి

ఇది గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పిమొదలవుతుంది. ఆ తర్వాత వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి (winter sore throat) బాధిస్తుంటుంది.

Sore Throat (Photo Credits: Pixabay)

చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య గొంతు నొప్పి. ఇది గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పిమొదలవుతుంది. ఆ తర్వాత వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి (winter sore throat) బాధిస్తుంటుంది. గొంతులో ఇన్ఫెక్షన్, మంట సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల జ్వరం, జలుబు. తలనొప్పి (Headache) వంటివి కూడా వస్తాయి. గొంతు నొప్పి వచ్చినప్పుడు తగ్గడానికి పాటించవలసిన చిట్కాలు (Remedies for Sore Throat) తెలుసుకుందాం

గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిళించాలి. ఇలా చేస్తే గొంతునొప్పి మటుమాయం అవుతుంది. అలాగే అల్లం టీ గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు గొంతు ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది. మిరియాలతో పాలు తాగినా కూడా గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పితో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే నొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది. తేనె- నిమ్మరసం గోరువేచ్చని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితాన్నిస్తుంది. గొంతునొప్పి ఉండే సమయంలో చల్లని నీరు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

ఈ లక్షణాలు ఉంటే వారు ఒమిక్రాన్‌ వ్యాధి బారీన పడినట్లే.. రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట పట్టడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు అని చెబుతున్న సౌతాఫ్రికా డాక్టర్‌ ఉన్‌బెన్‌ పిల్లే

గొంతు నొప్పి (Sore throat) ఎక్కువగా బాధిస్తుంటే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం అన్నింటినీ కలిపి టీ తయారు చేసుకొని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు చల్లని నీటి (cool water)ని తాగ కూడదు. గోరువెచ్చని నీళ్ళు (Lukewarm water) తాగడం మంచిది. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి పుక్కలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.

అల్లం (ginger) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గొంతు ఇన్ఫెక్షన్ మరియు నొప్పి (Sore throat )ని తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో అల్లం (Ginger) ఉడకబెట్టండి. అనంతరం ఆ నీటిని రెండు మూడు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి (Sore throat) నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం (lemon juice), కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. వీటివల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఉప్పు (salt)లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది దగ్గు, ఇన్ఫెక్షన్ నుంచి బయట పడేస్తుంది

మరో భయంకరమైన వ్యాధి వెలుగులోకి, ఇప్పటికే దీని దెబ్బకు 89 మంది మృతి, సౌత్ సౌడాన్‌లో అంతుచిక్కని వ్యాధిని గుర్తించే పనిలో WHO

గొంతునొప్పి (Sore throat), గొంతు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందడానికి ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు, కొన్ని మిరియాలు వేసి కషాయం చేసుకోవాలి. ఈ కషాయాన్నినిద్రపోయే ముందు తాగడం వల్ల గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల గొంతు గరగర తగ్గుతుంది. అంతేకాకుండా గొంతు నొప్పి తగ్గుతుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆకులు తీసేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగితే కొంచెం నొప్పి మాయం.