Air Pollution Cause Diabetes: వాయు కాలుష్యంతో డయాబెటిస్ సోకే అవకాశం మరింత ఎక్కువ అంటున్న శాస్త్రవేత్తలు, అసలు సంగతి ఏంటో తెలిసిపోయిందిగా..
కాలుష్యంతో నిండిన గాలి పీలిస్తే పేగులో బాక్టీరియా సంఖ్య ఎకువై స్థూల కాయం, మధుమేహం, జీర్ణకోశ వ్యాధులు ఇతర మొండి వ్యా ధులు సంక్ర మిస్తాయని కొత్త అధ్యయనం వెల్లడించింది.
కాలుష్యంతో నిండిన గాలి పీలిస్తే పేగులో బాక్టీరియా సంఖ్య ఎకువై స్థూల కాయం, మధుమేహం, జీర్ణకోశ వ్యాధులు ఇతర మొండి వ్యా ధులు సంక్ర మిస్తాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. వాయు కాలు ష్యానికి, మానవ పేగుల్లోని బ్యాక్టీరియా చర్యకు ఉన్న సంబంధాన్ని మొట్టమొదటి సారిగా వెల్ల డించిన ఈ అధ్యయనాన్ని జర్నల్ ఎన్వి రాన్ మెంట్ ఇంటర్నేషనల్ లో ప్రచురించారు. మన పేగుల్లో దాదాపు లక్ష కోట్ల (ఒక ట్రిలియన్) సూక్ష్మ బాక్టీరి యా నివసిస్తుంది. వయోజనుల్లో ఓజోన్ అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు, సూక్ష్మ జీవుల వైవిధ్యం తక్కువగా ఉంటుం దని వీటిలో కొన్ని ఐబకాయాన్ని కలిగిస్తాయని పరిశోధనలో కనుగొన్నారు.
ఇదివరకటి పరిశోధనలో వాయు కాలుష్య కారకాలు అనారోగ్య ఫలితాలకు కారణాలవుతాయని కనుగొన్నట్టు అధ్యయనానికి చెందిన సీనియర్ రచయిత టాన్యా అలరెట్ వెల్లడిం చారు. అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ కొలొరాడ్ బౌల్డర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా టాన్యా పనిచేస్తున్నారు. పేగుల్లో మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతాయని తెలుసుకోవాలని సూచించారు.
ఈ అధ్యయనం ప్రకా రం ప్రపంచం మొత్తం మీద ఏటా వాయుకాలుష్యానికి 8.8 మిలియన్ మంది చనిపోతున్నారు. అంటే పొగతాగడం, లేదా యుద్ధాల వల్ల చనిపోయిన వారి సంఖ్య కన్నా ఈ సంఖ్యే ఎక్కువని తేలింది. బ్లడ్ సుగర్ స్థాయిలను నియంత్రించడంలో శరీర సామర్ధాన్ని కూడా వాయు కాలుష్యం దెబ్బతీస్తుం దని ఊబకాయానికి దారి తీస్తుందని అందువల్ల శ్వాసకోశ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవరసమని గత అధ్యయనంలో తేలింది.