Health Benefits of Spiny Gourd : బోడ కాకర కాయలను ఇలా తీసుకుంటే జీవితంలో డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు, ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర ఆరోగ్య ఖని అనే చెప్పాలి.
కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర ఆరోగ్య ఖని అనే చెప్పాలి. కాకరకాయల జాతికి చెంది నవే ఆకాకరకాయలు. వర్షాకాలంలో ఇవి విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో ఉన్నాయి. బోడ కాకరకాయలు తింటే, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెబ్తున్నారు. ఇందులో బి1 ,బి2 , బీ3 లాంటి విటమిన్లు అధికంగా ఉంటాయని బోడ కాకరకాయ తింటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా.. అదుపులో ఉంటాయని చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి. వందగ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కేలరీలుంటాయి. వీటిల్లో పీచు, విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయివి. దీనిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. -మధుమేహంతో బాధ పడేవారు వీటిని తింటే మంచిది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. – దీనిలోని పైటో న్యూట్రియంట్లు కాలేయం కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.
తరచూ తీసుకుంటే శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీనిలో ఉండే సి విటమన్ శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. ప్లవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఎ కంటిచూపునకు మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్య ఉన్నవాళ్లు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది.