Long COVID Fatigue: లాంగ్ కోవిడ్ బాధితులను వేధిస్తున్న కొత్త సమస్య, అలసటతో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు, సరికొత్త అధ్యయనంలో వెల్లడి

UCL, యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌లోని పరిశోధకుల నేతృత్వంలోని కొత్త అధ్యయనం ఈ విషయాలను కనుగొంది.

Representational image (Photo Credit- ANI)

Long Covid can impact quality of life: అలసట అనేది సుదీర్ఘమైన కోవిడ్ రోగుల రోజువారీ జీవితాలను గణనీయంగా ప్రభావితం చేసే లక్షణం.ఇది కొన్ని క్యాన్సర్‌ల కంటే జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. UCL, యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌లోని పరిశోధకుల నేతృత్వంలోని కొత్త అధ్యయనం ఈ విషయాలను కనుగొంది.ఈ మేరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ కేర్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐహెచ్‌ఆర్‌) జర్నల్‌లో కథనం ప్రచురితమైంది.

ఈ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలం కొవిడ్‌తో బాధపడిన 3,750 మంది రోగులపై యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌(యూసీఎల్‌), యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌కి చెందిన వైద్యులు పరిశోధనలు చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత వారి ఆరోగ్యంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయన్న దానిపై ఈ వైద్యుల బృందం పరిశోధించింది.

విధి ఎంత చిత్రమైనది, వేలమందికి గుండె సర్జరీలతో ప్రాణదానం, చివరకు అదే గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ

అలసట, నిరాశ, ఆందోళన, మెదడు చురుకుదనం తదితర అంశాలపై ప్రశ్నలకు దీర్ఘకాలిక కొవిడ్‌ బాధితుల నుంచి ఓ యాప్‌ ద్వారా సమాధానాలు రాబట్టారు. వీరిలో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇది ఎంతలా ఉందంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు ఓ బాధితుడు ఎంతలా అలసటకు గురవుతాడో అంతకంటే.. ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.

మొత్తంమీద, రోగుల రోజువారీ కార్యకలాపాలపై సుదీర్ఘమైన COVID ప్రభావం స్ట్రోక్ రోగుల కంటే అధ్వాన్నంగా ఉందని మరియు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న రోగులతో పోల్చదగినదని బృందం కనుగొంది.

బాధితుల జీవితాలపై దీర్ఘకాలిక కొవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని మా అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రభావం వల్ల రోజువారీ కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధ్యయనానికి నాయకత్వం వహించిన డా. హెన్రీ గుడ్‌ఫెలో వెల్లడించారు. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసిన వారిలో 90 శాతం మంది 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే.

ఈ 5 అలవాట్లే గుండెపోటుకు ప్రధాన శత్రువులు, వీటిని కంట్రోల్ చేసుకుంటే మీ గుండె పదిలంగా ఉంటుందని చెబుతున్న నిపుణులు

కొవిడ్‌ సోకిన తర్వాత మునుపటిలా పని చేయలేకపోతున్నామని అందులోని దాదాపు 51శాతం మంది పేర్కొన్నారు. 20 శాతం మంది పూర్తిగా పని చేయలేకపోతున్నామని చెప్పారు. మరోవైపు తమ వివరాలు పేర్కొన్న కొవిడ్‌ బాధితుల్లో 71శాతం మంది మహిళలే కావడం గమనార్హం.