Moms With HIV Can Breastfeed: హెచ్‌ఐవీ సోకిన తల్లులూ తమ బిడ్డలకు పాలివ్వొచ్చు, దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేసిన అమెరికా

హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వడంపై అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ఎత్తివేసింది.

Breastfeeding (Photo Credits: File Image)

హెచ్‌ఐవీ తల్లులు కూడా పిల్లలకు పాలివ్వొచ్చని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ తాజాగా స్పష్టం చేసింది. హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వడంపై అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ఎత్తివేసింది.ఎయిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేరళలో బ్రెయిన్-ఈటింగ్ అమీబా కలకలం, వాంతులు, జ్వరంతో మైనర్ బాలిక మృతి, మెదడు తినే అమీబా లక్షణాలు ఎలా ఉంటాయంటే..

వారు వాడుతున్న మందులు తల్లిపాల ద్వారా బిడ్డకు వైరస్‌ సోకే ముప్పును ఒకశాతంలోపునకే పరిమితం చేస్తున్నట్టు కొలరాడో యూనివర్సిటీ హెచ్‌ఐవీ నిపుణురాలు, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ లిసా అబౌగి తెలిపారు.అంతకుముందు తల్లిపాల నుంచి పిల్లలకు వైరస్‌ సోకే ముప్పు 30 శాతంగా ఉంటే ప్రస్తుతం అది ఒక శాతానికి తగ్గింది. కాగా అమెరికాలో హెచ్‌ఐవీతో బాధపడుతున్న మహిళల్లో ప్రతి ఏటా ఐదువేల మంది బిడ్డలకు జన్మనిస్తున్నారు.