Night shift Row: భయంకర నిజాలు వెలుగులోకి, రాత్రి పూట పనిచేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం, శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయట, వాషింగ్టన్ యూనివర్సీటీ పరిశోధనల్లో కొత్త నిజాలు
వీరి అధ్యయనం ప్రకారం పగటిపూట పనిచేసే వ్యక్తులతో పోలీస్తే, రాత్రిళ్ళు పనిచేసే వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని (Night shift work may increase cancer risk) తెలిపింది. ,ఈ రీసెర్చ్‌ను జర్నల్ ఆఫ్ పినీల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. వీరిలో శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలిపారు.
వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం చేశారు. వీరి అధ్యయనం ప్రకారం పగటిపూట పనిచేసే వ్యక్తులతో పోలీస్తే, రాత్రిళ్ళు పనిచేసే వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని (Night shift work may increase cancer risk) తెలిపింది. ,ఈ రీసెర్చ్‌ను జర్నల్ ఆఫ్ పినీల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. వీరిలో శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలిపారు.
అయితే..రాత్రిళ్ళు పనిచేసే వారిలో జీవ గడియారంలో మార్పులు వచ్చి..ఏదిసరిగ్గా గుర్తుండక పోవడం, ఆకలిలేకపోవడం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో గుండె సంబంధిత ప్రభావం కూడా ఎక్కువేఅని అంటున్నారు. కాగా, తాజా పరిశోధనలతో (Washington State University) నైట్ షిప్టులు ప్రమాదకరమనే విషయం మరోసారి రుజువైంది.
ఇదిలా ఉంటే అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులతో రాత్రిపూట కూడ పనిచేయించు కొంటున్నాయి. ఈ కంపెనీలు ప్రధానంగా అమెరికా,యూకే దేశాలతో తమ ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయనే విషయం ఇప్పటికే తెలిసిందే.
కొంతమందిపై పరిశోధకులు ప్రయోగాత్మకంగా జరిపారు. నైట్ షిఫ్ట్ లేదా డే షిఫ్ట్ షెడ్యూల్‌లో ఉన్నఆరోగ్యకరమైన వాలంటీర్లను ఉపయోగించింది. అయితే దీనిపై ఇంకా ఎక్కువ పరిశోధనలు చేయవలసి ఉన్నప్పటికీ, ఈ ఆవిష్కరణలు ఏదో ఒక రోజు రాత్రి షిఫ్ట్ కార్మికులలో క్యాన్సర్‌ను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి సహాయపడతాయి.
కాగా నైట్ షిఫ్ట్ కార్మికులలో క్యాన్సర్ ఎక్కువగా ఉందని ఆధారాలు ఉన్నాయి, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, నైట్ షిఫ్ట్ పనిని సంభావ్య క్యాన్సర్ అని వర్గీకరించడానికి దారితీసింది" అని ఇప్పటికీ శాస్త్రవేత్తలు రుజువు చేశారు.