White Onions: తెల్ల ఉల్లిపాయ..ఎర్ర ఉల్లిపాయ, రెండింట్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో తెలుసా, వైద్యులు ఏమి చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి
ఎక్కువ మంది వినియోగించే రకం కూడా ఇదే. అయితే అప్పుడప్పుడు తెల్ల ఉల్లిపాయలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.అందరూ ఏవైనా ఉల్లిపాయలే కదా..? అనుకుంటారు.
మార్కెట్లో ఎక్కువగా ఎర్రటి ఉల్లిపాయే (Red Onions) కనిపిస్తుంటుంది. ఎక్కువ మంది వినియోగించే రకం కూడా ఇదే. అయితే అప్పుడప్పుడు తెల్ల ఉల్లిపాయలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.అందరూ ఏవైనా ఉల్లిపాయలే కదా..? అనుకుంటారు. కానీ, ఈ రెండింటిలో (Red Onions Or White Onions) ఏది ఎక్కువ మంచిది? అని ప్రశ్నిస్తే నిస్సంకోచంగా తెల్ల ఉల్లిపాయలేనని (White Onions) వైద్యులు చెబుతున్నారు. తెల్ల ఉల్లిపాయలతో మన శరీరానికి ఎంతో మేలు ఉంది. వాటిల్లో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ (వాపు రాకుండా చేసే గుణం), యాంటీబయాటిక్ గుణాలు దండిగా ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగి ప్రయోజనాలు (White Onions benefits) ఓ సారి చూద్దాం.
తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గేందుకు సాయపడతాయి. కళ్లు, ముక్కు, చెవి ఇన్ఫెక్షన్లపై మంచి ప్రభావం చూపిస్తాయి. కార్బొహైడ్రేట్లు ఉన్న పదార్థాలను దేశవాసులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి అసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల అసిడిటీ సమస్య ఏర్పడుతుంది. అలాగే, మన శరీరం ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. తెల్ల ఉల్లిపాయలు ఆల్కలిన్ స్వభావంతో ఉంటాయి. కనుక అసిడిక్ స్వభావాన్ని తగ్గిస్తాయి.
స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని భయపడుతున్నారా, అయితే ఈ 5 అలవాట్లకు దూరంగా ఉండి, మగమహారాజు అనిపించుకోండి..
శ్వాసకోస సమస్యలపైనా తెల్ల ఉల్లిపాయలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల్లో వాపు గుణాన్ని తగ్గించి, శ్వాస మెరుగ్గా ఉండేందుకు సాయపడతాయి. తెల్ల ఉల్లిపాయల రసాన్ని, కొంచెం తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కాటన్ తీసుకుని ఉల్లిపాయల రసాన్ని ఛాతీ భాగంలో కూడా రాసుకోవచ్చు. కేశాలకూ తెల్ల ఉల్లిపాయలు మంచి చేస్తాయి. ఉల్లిపాయ రసాన్ని వెంట్రుక కుదుళ్లకు రాసుకోవచ్చు.
తెల్ల, ఎర్ర ఉల్లిపాయల్లో చాలా వరకు సాధారణ పోషకాలు ఒకటే. కానీ, తెల్ల ఉల్లిపాయల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే, ఎర్ర ఉల్లిపాయలంత ఘాటుగా తెల్లవి ఉండవు. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్ కూడా ఉంటుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు దండిగా ఉండడం గుండెకు కూడా మేలు చేస్తుంది.