Relation Tips: నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది, ఈ మధ్య త్వరగా ఔటైపోతున్నా, దీంతో పెళ్ళికి పనికి వస్తానా అనే భయం పట్టుకుంది, మీరే దారి చూపాలి

కొంతమందిలో ఏదో అవుతుందనే ఆలోచన వల్ల మానసికంగా కొన్ని సమస్యలు వస్తాయి. దీని వల్ల చేతుల్లో వణుకు రావొచ్చు. భయంతోనే ఇవన్నీ జరుగుతాయి కాని హస్త ప్రయోగం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.

Masturbation representational image (Photo credits: Pixabay)

ప్రశ్న :  నా పేరు వింకీ (పేరు మార్చాం) నా వయసు 28 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పట్నుంచి హస్తప్రయోగం అలవాటు ఉంది.మొదట్లో బానే ఉంది. కానీ ఈ మధ్య నరాల్లో బలహీనత, త్వరగా స్ఖలనం, శరీరంలో వేడి, కాళ్ళు, చేతులు వణకడం వంటి సమస్యలు వస్తున్నాయి. పూర్తిగా అంగస్తంభన జరగట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈ మధ్యే నాకు ఇంట్లో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు ఈ సమస్యలన్నీ తలుచుకుంటే భయమేస్తోంది. పెళ్ళి గురించి తలుచుకుంటే వణుకు పుడుతోంది. నేను పెళ్ళికి పనికొస్తానా.. నా సమస్యకి పరిష్కారం దారి చూపండి.

పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు, పెద్దగా లేదని, వంకరగా ఉందని ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు

జవాబు: హస్తప్రయోగం అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. కొంతమందిలో ఏదో అవుతుందనే ఆలోచన వల్ల మానసికంగా కొన్ని సమస్యలు వస్తాయి. దీని వల్ల చేతుల్లో వణుకు రావొచ్చు. భయంతోనే ఇవన్నీ జరుగుతాయి కాని హస్త ప్రయోగం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. హస్త ప్రయోగం చేయడం అనేది కామన్. దీనిని పెద్ద తప్పుగా ఆలోచిస్తున్నారనిపిస్తోంది. వీటి గురించి పెద్దగా ఆలోచించొద్దు. ఎలాంటి భయం లేకుండా పెళ్ళి చేసుకోండి.

యాంటిబయాటిక్స్‌ వాడేవారికి హెచ్చరిక, పేగులలో మంచి బ్యాక్టీరియాలను చంపేస్తున్నాయని అధ్యయనంలో వెల్లడి, తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు

అదే విధంగా మీకు మీకు త్వరగా స్కలనం జరుగుతుందని చెబుతున్నారు. దీని గురించి పెద్దగా బాధపడొద్దు. దాదాపు 70 శాతం మంది మగవారికి ఇలాంటి సమస్యలే ఉంటాయి. ఈ సమస్యని దూరం చేసేందుకు త్వరగా కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లి అయితే ముందుగానే ఆ పని కానివ్వాలని అనుకోవద్దు. ముందుగా ఫోర్ ప్లేలో పాల్గొనండి. దీని వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. ఫోర్‌ప్లేలో ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చేయండి. భార్య క్లైమాక్స్‌కి చేరాక ఆ పని స్టార్ట్ చేయండి.మీరు పడే సమస్యలన్నీ మానసికంగా వచ్చినవే కాబట్టి, వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా పెళ్ళి చేసుకోండి.