Health Benefits of Banana Peels: అరటి తొక్కే కదా అని తీసిపారేయకండి,దానిలోని ఆరోగ్యాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, మలబద్దకాన్ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది

అన్నం తిన్న తరువాత అరటిపండు తినడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందుకే పెళిల్లలో చాలా చోట్ల అరటిపండు(Banana)ను పెడుతుంటారు. అయితే చాలామంది అరటిపండును తిని దాని తొక్క(Banana Peels)ను పారేస్తుంటారు.

Health Benefits Of Banana Peels (Photo-Wiki commons)

November 15: మనలో చాలామందికి అరటిపండు అంటే చాలా ఇష్టం. అన్నం తిన్న తరువాత అరటిపండు తినడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందుకే పెళిల్లలో చాలా చోట్ల అరటిపండు(Banana)ను పెడుతుంటారు. అయితే చాలామంది అరటిపండును తిని దాని తొక్క(Banana Peel)ను పారేస్తుంటారు.

నిజానికి అరటి పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటి వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో, వాటి తొక్క వల్ల కూడా మనకు అనేక లాభాలు (Health Benefits) ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అరటి పండు తొక్క ఎలా మనకు ఉపయోగపడుతుందో ఓ సారి చూద్దాం.

అరటి పండు తొక్కలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. దీంతోపాటు మూడ్‌ను మార్చి డిప్రెషన్‌ను తగ్గించే సెరొటోనిన్ అనబడే సమ్మేళనం కూడా అరటి పండు తొక్కలో ఉంటుంది. అందుకనే ఆ తొక్కను తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

కాలిన గాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దన చేస్తే ఆయా గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అరటిపండు తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఆ తొక్కలను ముఖానికి మర్దన చేసినట్లు రాస్తే మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయట. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయట. దీంతో పాటుగా నీటిలో ఉండే లోహాలను, ఇతర విషపదార్థాలను తొలగించడంలోనూ అరటి పండు తొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో అరటి పండు తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.