Sexual Wellness: బెడ్రూంలో సెక్స్ చేయడం బోర్ కొట్టిందా, అయితే కొత్తగా ఇలా ప్లాన్ చేస్తే మీ పార్ట్‌నర్ సంతృప్తి చెందుతుంది...

ఇంట్లో సెక్స్‌ను బోర్‌గా ఫీలవుతున్న జంటలు ఈ ఆటను హోటళ్లలో రంజుగా సాగించేందుకు ప్లాన్‌ చేసుకోవడం ఇటీవల పెరుగుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

(Photo Credits: Unsplash)

కొత్త తరం కొత్త తరహాలోనే సెక్స్‌ జీవితం ఉండాలని కోరుకుంటోంది. ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు బయట ప్రదేశాల్లో రతిక్రీడ సాగించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. ఇంట్లో నాలుగు గదుల మధ్య సాగే రతిక్రీడ పట్ల ఇటీవల చాలామంది ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి జంటలు దీనికోసం హోటళ్లనే ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో సెక్స్‌ను బోర్‌గా ఫీలవుతున్న జంటలు ఈ ఆటను హోటళ్లలో రంజుగా సాగించేందుకు ప్లాన్‌ చేసుకోవడం ఇటీవల పెరుగుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది సెక్స్ లైఫ్‌ను సరిగా ఎంజాయ్ చేయలేరు. ఒకవేళ చేసినా నాలుగు గోడల మధ్య బోరింగ్‌గా ఆ ప్రక్రియను కానిచ్చేస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని రోజులు హోటల్‌లో బస చేస్తే వారి జీవితంలో కచ్చితంగా మార్పులు వస్తుందంటున్నారు సెక్స్ నిపుణులు. హోటల్‌లో బస చేయడం వల్ల ఇతర టెన్షన్లు ఏమీ ఉండవు. ఫుడ్ కూడా కోరుకుంటే గదికే వస్తుంది. పనులు చేసే భారం తప్పుతుంది. కాబట్టి ఇద్దరికీ కావాల్సినంత సమయం దొరుకుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంది రతిక్రీడలో మునిగి తేలిపోవచ్చు.

కొత్త ప్రదేశం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి చోట సెక్స్‌ను ఆస్వాదించడాన్ని కొందరు అడ్వెంచర్‌గా భావిస్తుంటారు. ఇది కచ్చితంగా కోరికలను పెంచుతుంది. ఇంటిని వదిలి రావడం వల్ల అక్కడ కలిగే టెన్షన్‌లకు విరామం వస్తుంది. అందువల్ల వాటన్నింటినీ పక్కనబెట్టి పార్టనర్‌గా సంతోషంగా గడిపేందుకు వీలు చిక్కుతుంది. అందరికీ దూరంగా ఏకాంతంగా గడపడం వల్ల తొలినాళ్లలో వారి మధ్య తీపిగుర్తులను మరోసారి గుర్తుకుతెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారిద్దరి మధ్య బంధం మరింత బలపడటానికి సాయం చేస్తుందని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు. ఎలాంటి టెన్షన్లు లేకపోవడంతో హోటల్ సెక్స్‌ను జంటలు చాలా థ్రిల్‌గా ఫీలవుతుంటాయని చెబుతున్నారు.