Pantone Color of the Year 2024: క‌ల‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా పీచ్ ఫ‌జ్, ఏరికోరి ఈ రంగునే ఎందుకు ఎంచుకున్నారంటే?

ఇది విభిన్న చిప్ ఆకృతితో రంగులను నిర్వహిస్తుంది. కంపెనీ పాంటోన్ కలర్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా నడుపుతుంది, ఇంత ప్ర‌సిద్ది చెందిన కంపెనీ పీచ్ ఫ‌జ్ ను క‌లర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా గుర్తించ‌డం విశేషం.

Pantone Color of the Year

New Delhi, DEC 12:  "పీచ్ ఫజ్" (Peach Fuzz) అని పిలువబడే మృదువైన, గులాబీ-నారింజ రంగు 2024 ఏడాదికి గానూ క‌ల‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ఎంపికైంద‌ని పాంటోన్ (Pantone Color of the Year ) తెలిపింది. ఈ మేర‌కు పీచ్ ఫ‌జ్ రంగుకు (Peach Fuzz) "పంటోన్ 13-1023 పీచ్ ఫ‌జ్ అని నామ‌క‌ర‌ణం చేశారు.  పంటోన్ కంపెనీ డిజైన్, మ్యాచింగ్ సిస్ట‌మ్ లో రారాజుగా వెలుగొందుతోంది. 1960 నుంచి ఈ కంపెనీ మ్యాచింగ్ సిస్ట‌మ్ లో రాణిస్తోంది. ఇది విభిన్న చిప్ ఆకృతితో రంగులను నిర్వహిస్తుంది. కంపెనీ పాంటోన్ కలర్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా నడుపుతుంది, ఇంత ప్ర‌సిద్ది చెందిన కంపెనీ పీచ్ ఫ‌జ్ ను క‌లర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా గుర్తించ‌డం విశేషం.

 

పీచ్ ఫ‌జ్ క‌లర్ ను ఎంపిక చేసేందుకు అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ లీట్రైస్ ఐస్కాన్ తెలిపారు. ఈ ఏడాది  "సాన్నిహిత్యం, కనెక్షన్ కోసం మా సహజమైన కోరికను ప్రతిధ్వనిస్తుందన్నారు. "మేము వెచ్చదనం, ఆధునిక చక్కదనంతో ప్రకాశవంతమైన రంగును ఎంచుకున్నాము," ఆమె తెలిపారు. "కరుణతో ప్రతిధ్వనించే నీడ, స్పర్శ ఆలింగనం అందజేస్తుంది.