IPL Auction 2025 Live

Annavaram: అన్నవరంలో రేపటి నుండి కొత్త నిబంధన.. రేపటి నుంచి కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటన.. గాజు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీరు విక్రయించేందుకు మాత్రమే అనుమతి

రేపటి (మంగళవారం) నుంచి కొండపై ప్లాస్టిక్‌ ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. కొండపై ఉన్న దుకాణాల్లో కేవలం గాజు సీసాలు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారని చెప్పారు.

Annavaram (Credits: Twitter)

Annavaram, Aug 14: పర్యావరణ పరిరక్షణ కోసం కాకినాడ (Kakinada) జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram) దేవస్థానం కొత్త నిబంధన అమలు చేయనుంది. రేపటి (మంగళవారం) నుంచి కొండపై ప్లాస్టిక్‌ (Plastic) ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో (Temple EO) ఆజాద్ తెలిపారు. కొండపై ఉన్న దుకాణాల్లో కేవలం గాజు సీసాలు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారని చెప్పారు. 750 ఎమ్ఎల్ గాజు సీసాల్లో నీటికి రూ.60, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీటికి రూ.40 రేటు ఖరారు చేసినట్టు వివరించారు. గాజు సీసా తిరిగిచ్చేవారు రూ.40 వెనక్కు తీసుకోవచ్చని వెల్లడించారు.

Leopard at Tirumala: తిరుమలలో ఆరేళ్ల బాలికను పొట్టనపెట్టుకున్న చిరుత ఆటకట్టు.. ఎట్టకేలకు బోనులోకి.. వీడియోతో..

మూత తెరవని కూల్ డ్రింక్స్ ను(మంచినీళ్లు మినహా) మాత్రమే కొండపైకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలు పాటించేలా తనిఖీలు కూడా చేస్తామని పేర్కొన్నారు. కొండపై జరిగే వివాహాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై రూ.500 జరిమానా విధిస్తామని, ఆలయ సిబ్బంది అంతా ఈ రూల్స్ పాటించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.

TSPSC New schedule Group-2 Exam: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేసిన TSPSC



సంబంధిత వార్తలు